విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ – సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడీ చిత్రం ఎఫ్ 3. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఎఫ్ 2 మూవీలో నటించిన తమన్నా, మెహర్రీన్ ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించి తాజా వార్త ఏంటంటే.. ఇందులో సీనియర్ యాక్టర్ గోపరాజు రమణ వెంకటేష్’తండ్రి పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. యువ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్ లో కొండల్ రావు పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా విక్టరీ వెంకటేష్ కు తండ్రి పాత్ర పోషించే ఛాన్స్ దక్కించుకున్నారు.
డిసెంబర్ నెలలో వెంకటేష్ 60 వ పుట్టినరోజు సందర్భంగా ఎఫ్ 3 మూవీని ప్రకటించారు. ఎఫ్ 2 లో ఫన్ అండ్ ఫస్ట్రేషన్ ఇద్దరు భర్తల నిరాశను చూపించి ఎంటర్ టైన్ చేస్తే.. ఎఫ్ 3 లో డబ్బు చుట్టూ ఫన్ ఫస్ట్రేషన్ చూపించి ఎంటర్ టైన్ చేయనున్నారని తెలిసింది. ఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఎఫ్ 3 కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అని టీమ్ గట్టి నమ్మకంతో ఉంది. ఆగష్టు 27న రానున్న ఎఫ్ 3 ఏ స్ధాయి విజయం సాధిస్తుందో చూడాలి.
Must Read ;- విక్టరీ వెంకటేశ్ కి ‘లక్కీ కీ’ దొరికిందా?