విక్టరీ వెంకటేష్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు అయిన వెంకటేష్ ఎంతో కృషితో అనతికాలంలోనే పెద్ద స్టార్ గా ఎదిగారు. తను నటించిన ‘కలియుగ పాండవులు’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు వెంకీ. తక్కువ టైంలోనే విక్టరీ అనే టైటిల్ ను తన పేరు ముందు చిరస్థాయిగా ఉండిపోయేలా మంచి సినిమాల్లో నటించి ఎవ్వరికీ సాధ్యంకాని విజయాలను ఆయన సాధించారు. టాలీవుడ్ కు ఎక్కువ మంది హీరోయిన్స్ ను పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. అలాంటి విక్టరీ వెంకటేష్ ఈ రోజు తన 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
Must Read ;- వెంకీ పుట్టినరోజు కానుకగా ఎఫ్ 3 మూడింతల వినోదం
ఇప్పటికే ఆయనకు అనేకమంది సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వెంకీకి తన ఇన్ స్టా ఖాతా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో అతి తక్కువ మంది స్నేహితులు ఉంటారు. అందులో వెంకీ ప్రథముడు. తనకు వెంకటేష్ అంటే ఎంత ఇష్టమో ఇప్పటికే అనేకసార్లు బహిరంగంగానే తెలిపారు పవన్. వీరిద్దరూ కలిసి ‘గోపాల గోపాల’ సినిమాలో కూడా నటించారు. అప్పుడే వీరిద్దరి బలమైన స్నేహం కోసం అందరికి తెలిసింది. వీరిద్దరిని కలిపింది పుస్తకాలే అని అంటారు.
పవన్, వెంకటేష్. పవన్ ఎక్కువగా దైవ చింతనలోనే ఉంటారు. ఆధ్యాత్మికత పుస్తకాలను చదువుతుంటారు. అలాగే వెంకీ కూడా ఆధ్యాత్మికత పై ఎక్కువ మక్కువ చూపిస్తారు. మొదట మేము మాట్లాడుకున్నది ఆధ్యాత్మికత, దేవుడి పుస్తకాల కోసం. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ బలమైన స్నేహితులుగా మారిపోయాం. ఇది ఎవరో చెప్పింది కాదు ‘గోపాల గోపాల’ సినిమా ఆడియో ఫంక్షన్ లో స్వయంగా పవన్ చెప్పిన మాటలు. ఇప్పుడు పవన్ చేసిన పనికి వెంకటేష్ అభిమానులు సోషల్ మీడియాలో పాజిటివ్ గా స్పందిస్తున్నారు. వీరిద్దరి స్నేహం కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే తమ అభిమాన హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు.
Also Read ;- టీజర్ టాక్ : ఆవేశంతో గర్జించిన ‘నారప్ప’