మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల్లో నటిస్తున్నారు. అయితే.. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ఇప్పటి వరకు అఫిషియల్ గా ప్రకటించలేదు. రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఇతనే అంటూ కొంత మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వంశీ పైడిపల్లి, వెంకీ కుడుముల, గౌతమ్ తిన్ననూరి, లోకేష్ కనకరాజ్.. తదితర దర్శకులు పేర్లు వార్తల్లోకి వచ్చాయి.
అయితే.. చరణ్ సినిమా ఎవరితో కన్ ఫర్మ్ అయ్యింది అనేది మాత్రం ఎనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే.. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని రామ్ చరణ్ మేనేజర్ ప్రవీణ్ కలిసారని తెలిసింది. అనిల్ రావిపూడి ఈ ఇయర్ ఎండింగ్ లో ఎవరితోనైనా సినిమా కమిట్ అయ్యారా..? లేదా.? అనేది మాట్లాడినట్టు సమాచారం. దీనిని బట్టి చరణ్.. అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు. ఎఫ్ 2 మూవీకి సీక్వెల్ గా రూపొందుతోన్న ఎఫ్ 3లో వెంకీ – వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని సమ్మర్ కి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. అన్నీ అనుకున్నట్టు జరిగితే రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూవీ ఫిక్స్ కానున్నట్టు సమాచారం.
Must Read ;- అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎనర్జిటిక్ హీరో!