విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్ లో విజయం సాధించిన అసురన్ మూవీకి ఇది రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది కానీ.. కరోనా కారణంగా ఆగింది. ప్రస్తుతం నారప్ప షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే.. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకుండానే ఎఫ్ 3 మూవీ స్టార్ట్ చేశాడు వెంకీ.
సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎఫ్ 2 మూవీకి సీక్వెల్ గా రూపొందుతోన్న ఎఫ్ 3 సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన ఎఫ్ 3 మూవీని సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది దిల్ రాజు ప్లాన్.
అయితే.. నారప్ప, ఎఫ్ 3 ఈ రెండు చిత్రాలు ఇంచుమించు ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకోనున్నాయి. దీంతో ఈ రెండింటిలో ఏ సినిమా ముందుగా రిలీజ్ కానుంది అనేది ఆసక్తిగా మారింది. మేటర్ ఏంటంటే.. ముందుగా ఎఫ్ 3 సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఆతర్వాతే నారప్ప సినిమాని రిలీజ్ చేస్తారని తెలిసింది. ఇలా చేయడానికి ఓ స్పెషల్ రీజన్ ఉంది. అది ఏంటంటే.. వెంకీ 74వ సినిమాగా నారప్ప స్టార్ట్ అయ్యింది. అయితే.. 74వ సినిమాగా ఎఫ్ 3 రిలీజ్ చేసి.. వెంకీ 75వ చిత్రంగా నారప్ప సినిమాని రిలీజ్ చేయడానికి సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Must Read ;- ‘నారప్ప’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎవరితో తెలుసా.?











