ఓటీటీ శబ్దం కాస్తా ఓటి శబ్దంలా మారిపోయింది. నిజానికి 2020ని కరోనా నామ సంవత్సరం అనాలేమో. సినిమాలు అలా నడిచొచ్చాయి.. ఓటీటీకి భలే కొలిసొచ్చింది. 2021 మాత్రం సినిమా థియేటర్లన్నీ కళకళలాడబోతున్నాయి. థియేటర్లు దొరక్క నిర్మితలు, పంపిణీదారులు తగాదా పడే రోజులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల జోరు ఎక్కువగా ఉంది.
విడుదల కోసం భారీగా సినిమాలు క్యూకడుతున్నాయి. దాదాపు 7 పెద్ద చిత్రాలు, 25 మీడియం బడ్జెట్ చిత్రాలు, 40 దాకా చిన్న సినిమాలు ఈ ఏడాది విడుదల కోసం లైన్ లో ఉన్నాయి. ఈ వేసకి కల్లా చిత్ర పరిశ్రమ సాధారణ స్థితికి చేరకుంటుంది. పూర్వ వైభవం రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం సడలింపు నిబంధనలతో చిత్ర పరిశ్రమలోనూ కొత్త కొళ వచ్చింది.
ఓటీటీ వైపు రెండు సినిమాల చూపు
ఇక ఓటీటీలో నేరుగా సినిమాలు విడుదల కావనుకుంటున్న తరుణంలో రెండు చిత్రాలు మాత్రం ఇందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అందులో ఒకటి వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఇందులో రకుల్ ప్రీతిసింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
రెండో చిత్రం అక్కినేని నాగార్జున నటించిన వైల్డ్ డాగ్. దీని హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. థియేటర్లు ప్రారంభమైన తరుణంలో ఓటీటీ ఆలోచన ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ఓటీటీలో విడుదలవుతాయా? థియేటర్లలోనా అనే విషయంపై త్వరలోనే క్లారిటీ వస్తుందని ఆశించవచ్చు.
Must Read ;- సినిమా థియేటర్లలో రేపటి నుంచి 100 శాతం సీటింగ్











