30 వరకు సెలవులను ప్రకటించిన ప్రభుత్వం..!
తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభత్వం ఈ నెల 8 నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ విద్యాసంస్థలకు ఉత్తర్వులను జారీ చేసింది. వైద్యారోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు కరోనా కేసుల సంఖ్య తెలంగాణలో రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంకోవైపు మరణాల శాతం కూడా క్రమేపి పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కరోజులోనే కొత్తగా 2,71,202 కేసులు నమోదు కాగా 314 మంది మృతి చెందారు.
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసులు సంఖ్య 7,743 చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు వాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా సాగుతోంది. దీంతో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు టీకాలు ఉపకరిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 156 కోట్ల 76 లక్షల 15 వేల డోసులను ప్రజలకు అందించి ప్రపంచంలోనే కొత్త రికార్డును నెలకొల్పింది భారత్. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజుకు 20 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదతువుతున్నాయి. శనివారం మొత్తం 23 లక్షల 53 వేల 411 మందికి వైరస్ అంటుకోగా.. 5,605 మంది మృతి చెందారు. ఇందులో 40 శాతం అమెరికాలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.