వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్‌ఎల్‌ఏ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు భయం పట్టుకుందా..? ఆయన వార్నింగ్ పనిచేసిందా..? స్పీకర్‌కి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక ఎమ్‌ఎల్‌ఏ వరసగా 60 రోజులపాటు అసెంబ్లీకి హాజరు కాకపోయినా వేటు పడుతుంది.. లేదా వరసగా మూడు శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టినా అనర్హత వేటు పడడం ఖాయం అని ఏపీ డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ గత కొన్ని రోజులుగా జగన్‌ని హెచ్చరిస్తూనే ఉన్నారు..
ఎమ్‌ఎల్‌ఏగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరవాత ఇంతవరకు ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు.. ఇప్పటికి రెండు సమావేశాలు జరిగాయి.. 24వ తేదీ నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.. ఇది మూడో సమావేశం.. శాసనసభ ప్రాంగణంలో ఆయన అడుగు పెట్టక దాదాపు రెండు నెలలు కావస్తోందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.. దీంతో, జగన్‌లో భయం పట్టుకుందని ప్రచారం జరుగుతోంది.. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.. ఈ దఫా హాజరు కాకపోతే, ఆయనపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోందని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు..
ఎమ్‌ఎల్‌ఏగా తనపై అనర్హత వేటు పడుతుందని భయపడ్డారో లేక అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే తనపై వేటు పడితే నెగిటివ్ అవుతుందని ఆలోచించారో తెలియదు కానీ, వైసీపీ ఎమ్‌ఎల్‌సీలకి ఆ పార్టీ శాసన మండలి నేత బొత్స సత్యనారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ఎమ్‌ఎల్‌సీలు అంతా ఈ నెల 24న మండలికి హాజరు కావాలని ఆదేశించారు.. ఇటు, వైసీపీ ఎమ్‌ఎల్‌ఏలు కూడా శాసనసభకు విధిగా హాజరు కావాలని సమాచారం అందింది..
ఈ నెల 24 నుండి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.. ఇవి ఏపీకి ఎంతో కీలకంగా మారనున్నాయి.. ఇటు వైసీపీకి కూడా.. సూపర్ సిక్స్‌లోని అనేక పథకాలకు ఈ బడ్జెట్‌లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది చంద్రబాబు సర్కార్.. అంతేకాదు, పలు అభివృద్ధి పథకాలకు సైతం ఆయన ఆమోదం తెలపనున్నారు.. ఇదే సమయంలో గత అయిదేళ్లు ఏపీలో జగన్ హయాంలో జరిగిన విధ్వంసంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.. లిక్కర్ స్కామ్, పెద్దిరెడ్డి ల్యాండ్, మైనింగ్ మాఫియా, సజ్జల అటవీ భూముల ఆక్రమణపైనా పెద్ద ఎత్తున చర్చ జరిగే చాన్స్ ఉంది.. ఇవి జగన్‌ని భయపెడుతున్నాయి.. తన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపైనా డిస్కషన్‌కి రావొచ్చు.. ఇవే వైసీపీలో బీపీని పెంచుతున్నాయి.. అందుకే, ఇటు అనర్హత వేటు నుండి తప్పించుకోవడం, అటు తనని టార్గెట్ చేస్తే సానుభూతి దక్కించుకోవడం అనే అంశాల ఆధారంగా జగ్ అసెంబ్లీలో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారని సమాచారం.. మరి, ఆయన శాసనసభకు వచ్చి సంతకం చేసి వెళతారా?? అసెంబ్లీకి వస్తారా?. అనేది రెండు మూడు రోజుల్లో తేలనుంది.. ఏది ఏమయినా ట్రిపుల్ ఆర్ వార్నింగ్… జగన్‌ని కదిలించిందనే చర్చ సాగుతోంది..











