మూడు పువ్వులు.. ఆరుకాయలుగా జూదం..!
వైసీపీ పాలనలో జూదం, అక్రమ మద్యం, గంజాయి వంటివి మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. ప్రతి మండల కేంద్రంలో పేకాట స్థావరాలను నెలకొల్పి .. అనాధికార నైట్ క్లబ్ లను ప్రారంభిస్తున్నారు. ఇందులో స్థానిక పోలీసులకు షేర్ కూడా ప్రకటించి, పంచుతుంటారన్నది బహిరంగ రహస్యమే! శనివారం రాత్రి గుంటూరు జిల్లా మంగళగిరిలో పేకాట ఆడుతూ.. 13 మంది పేకాట రాయుళ్లు పోలీసులకు పట్టుపడ్డారు. వీరిలో అధికార పార్టీ ఎమ్మెల్సీ కుమారుడు కూడా ఉన్నారు. అయితే యథేచ్ఛగా పేకాట ఆడేందుకు మంగళగిరిలోని ఓ డింబర్ డిపోను కేంద్రంగా చేసుకున్నారు. పోలీసులు దాడి చేసిన సమయంలో సదరు ఆ టింబర్ డిపో యజమాని తప్పిచుకోగా.. ఎమ్మెల్సీ కుమారుడు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అధికార మదాన్ని ప్రదర్శించి, పోలీసులను తోసుకుంటూ బయటకొచ్చి, స్పాట్ నుంచి పారిపోయాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి, 13 మంది అదుపులోకి తీసుకోగా.. 14వ నిందుతుడిగా టింబర్ డిపో యజమాని, 15వ నిందుతుడిగా ఎమ్మెల్సీ కుమారుడి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. తప్పించుకుని ఇరువురు కోసం గాలిస్తున్నామని, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.