వారాలబ్బాయిలుగా మారిన బండి, బొప్పరాజు!
ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు కాస్తా.. ఏపీ లో వారాలబ్బాలుగా మారారు! జాయింట్ స్టాప్ కౌన్సిల్ మీటింగ్స్, సీఎస్ తో భేటీలు, ప్రభుత్వ సలహాదారు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనతో వరుస సమావేశాలు వంటివి ఉద్యోగుల సమస్యలకు పరిష్కరాన్ని చూపలేకపోతున్నాయి. పోగా .. ఈ వారం వరకు ఆగండి, పండుగ తరువాత సీఎంతో కలిపిస్తాం.. అని ఉద్యోగుల ఆశలపై వారాల తరబడి నీళ్లు చల్లుతూనే వస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని విరమించమని భీష్మించిన జేఏసీ నేతలు బండి, బొప్పరాజు ఇప్పడు ఏమని ఉద్యోగులకు సమాధానం చెబుతారు. సమస్య పరిష్కారం కాకమునిపే, ప్రభుత్వం సానుకూలంగా ఉంది .. తప్పక డిమాండ్స్ నెరవేర్చుతోందని నమ్మి .. ఉద్యోగులు చేస్తున్న నిరసనలను విరమించేలా చేసిన జేఏసీ నేతలు నేడు డైలమాలో పడి .. తలపట్టుకోవాల్సి పరిస్థతి ఎందకొచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోవాల్సి వస్తోంది!
పట్టుపట్టనేలా? విడవనేలా..?
ఉద్యోగుల భవిష్యత్తు కోసం భీష్మ ప్రతిజ్ఞ చేసిన ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు నేడు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల ముందు ఊరించి.. నేడు ఉసురుమనిస్తున్న జగన్ చర్యలు ఉద్యోగ సంఘాల నేతలకు అంతుచిక్కడం లేదు. చేసిన హామీని మరిచారు.. పరిష్కరిస్తానన్న సమస్యలను గాలికొదిలేయడం ఎంత వరకు సబబు అని జగన్ ను నిలదీస్తున్నారు. ఇదిగో వారం రోజు .. అదిగో నెలఖరు అంటూ వారాలకొద్ది వాయిదాలు వేస్తూ .. ఉద్యోగులను ఉక్కిరిబిక్కి చేస్తున్నారు. డిసెంబర్ 7 నుంచి తమ డిమాండ్స్ ను నెరవేర్చుకునేందుకు వివిధ రూపాల్లో సమ్మెకు దిగిన ఉద్యోగులు పదిరోజులు గడవకముందే విరమించి తప్పు చేశారా? అంటే అవుననే ఉద్యోగులు నుంచి వస్తున్న సమాధానాలు! సీఎస్, సజ్జల, బుగ్గన తో వరుస సమావేశాల సారాన్ని బలంగా నమ్మి ఉద్యమాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్లు జేఏసీ నేతలు డిసెంబర్ 16న నిర్ణయించారు. నాటి నుంచి నేటి వరకు వారం కావస్తున్నా నేటికి ఉద్యోగ సమస్యల పరిష్కారినికి ప్రభుత్వ ఒక అడుగు కూడా ముందుకేసి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. వారం .. మరో వారం .. ఇంకో వారం అంటూ వాయిదాల పరంపరేలా తప్పా.. పీఆర్సీ, 71 డిమాండ్లలు పరిష్కారానికి మార్గం చూపలేకపోయింది జగన్ రెడ్డి ప్రభుత్వం. దీంతో మరోసారి ఉద్యమ బాట పట్టేందకు జనవరి 3, 2022 తరువాత నిర్ణయం ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు వెల్లడించారు. ఇలా పట్టుపట్టడం.. వదలడం.. వంటివి జేఏసీ నేతలు చేయడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని రాజేస్తున్నాయి. పరిష్కార మార్గం చూపాల్సింది జేఏసీ నేతలనని, వారిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నారు ప్రభుత్వం ఉద్యోగులు!











