బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ కాగా, ఆతర్వాత రెండో సీజన్ కు నాని హోస్ట్ గా చేశారు. ఆతర్వాత బిగ్ బాస్ మూడు, నాలుగు, ఐదు సీజన్ లకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. తనదైన స్టైల్ లో నాగ్ హోస్ట్ గా చేసి విశేషంగా ఆకట్టుకున్నారు.
అయితే.. మరో రెండు నెలల్లో ఓటీటీ కోసం ప్రత్యేకంగా బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. దీనికి నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల బాలయ్య ఆహా కోసం అన్ స్టాపబుల్ అంటూ టాక్ షోకు హోస్ట్ గా చేయడం.. దీనికి అనూహ్యమైన స్పందన రావడం జరిగింది. దీంతో ఓటీటీ కోసం చేసే బిగ్ బాస్ షోకు బాలయ్య హోస్ట్ గా చేస్తారేమో అనుకున్నారు. అయితే.. ఈ రోజు స్టార్ మా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఇందులో ప్రచారంలో ఉన్న ఈ వార్త పై క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఓటీటీ కోసం చేసే బిగ్ బాస్ షోకు కూడా తానే హోస్ట్ గా చేయనున్నట్టుగా నాగార్జున స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ షో పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఓటీటీ కోసం చేసే షోలో ఎవరెవరు పాల్గొంటారు..? ఈ షోలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తున్నారా.? అనేది ఆసక్తిగా మారింది. ఈ షో గురించి మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.











