కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయని నిన్న ఓ జీవో చక్కర్లు కొట్టింది. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో తిరిగి లాక్డౌన్ విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అది నకిలీ జీవో అని ఆయన కొట్టిపారేశారు. తానుకానీ, రాష్ర్ట ప్రభుత్వంకానీ ఎలాంటి ఉత్తుర్వులు కూడా జారీ చేయలేదని పేర్కొన్నారు. గురువారం రాత్రి రాష్ట్రంలో సాయంత్రం ఆరు నుంచి తెల్లవారు ఎనిమిది గంటల వరకు లాక్డౌన్ విధించినట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసులు పెరుగుతున్నందున ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
Also Read:తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు : క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్











