తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. గతంలో డీఎంకే అధినేత స్టాలిన్ ఇంట్లో సోదాలు చేసిన ఐటీ శాఖ, ఇప్పుడు ఆయన అల్లుడిపై గురి పెట్టింది. శుక్రవారం ఉదయం నుంచి శబరీశన్ నివాసంలో సోదాలు చేస్తోంది. నీలాంగరాయ్‌లోని ఆయన నివాసంతోపాటు నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఇదిలావుండగా శబరీశన్‌పై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. డిప్యూటీ స్పీకర్ జయరామన్‌పై వదంతుల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే డీఎంకే నేతలపై ఐటీ దాడులు జరగడం ఇది రెండోసారి. గతంలో 2013లో స్టాలిన్ ఇంట్లో సోదాలు జరిగాయి. వీదేశీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ సోదాలు చేసింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో స్టాలిన్ అల్లుడి ఇంట్లో సోదాలు జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Also Read:శశికళ రాజకీయ సన్యాసం.. చిన్నమ్మ ప్రకటనకు కారణాలేమిటో..!