రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ అమలుకావచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో లాక్ డౌన్ ఉండదని, ప్రజలు ఆందోళన చెందవద్దని తేల్చి చెప్పారు. గతంలో లాక్ డౌన్ వల్ల రాష్ర్ట ఆర్థికంగా దెబ్బతినదని, మరోసారి లాక్ డౌన్ ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
పాజిటివ్ కేసులు పెరుతుండటం వల్లనే బళ్లను బంద్ చేశామని, అది కూడా తాత్కాలికమేనని ఆయన అన్నారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు, భౌతికదూరం పాటించాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్రంలో థియేటర్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయాలంటూ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.
Must Read ;- ఖబర్దార్ కేసీఆర్ : భగ్గుమన్న వరంగల్ విద్యార్థులు