May 3, 2026 1:00 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

రేకులు విడిపోయిన ‘విజయ’కమలం!

విజయనగరం జిల్లాలో పువ్వు గుర్తు పార్టీకి రేకులు విడిపోయాయి! విజయనగరం జిల్లా భాజపాలో గ్రూపులు పెరిగిపోయాయి. పార్టీ ఇక్కడ అద్భుతబలంతో లేదుగానీ.. ఉన్న నాయకులు  కూడా విభేదాలతో పార్టీని దిగజారుస్తున్నారు.

August 22, 2020 at 8:59 AM
in Editors Pick, Latest News, Opinion, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

జాతీయస్థాయిలో ప్రధాన భూమిక పోషిస్తున్న భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ లోను పాగా వేయాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. అందుకోసం జిల్లా స్థాయి నుండి రాష్ట్రం వరకు పార్టీని పటిష్టం చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించింది.  అదేతరుణంలో విజయనగరం జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ‘మూడు గ్రూపులు .. ఆరు వర్గాలు’గా తయారైంది. పార్టీ జిల్లా నాయకుల్లో ఒకరంటే మరొకరికి అస్సలు పొసగడం లేదు. నాయకులు,  కార్యకర్తలు  పైకి కలిసి ఉన్నట్టు నటిస్తున్నారే గానీ వాస్తవానికి  కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు.

పార్టీ నాయకుల మధ్య సమన్వయం,   సఖ్యత దుర్భిణితో వెతికినా సూది మొనంత కూడా కనిపించడం లేదు. వీళ్ళ మధ్య కార్యకర్తలు  నైరాశ్యంతో విసిగిపోతున్నారు. ఈ  నేపథ్యంలో జిల్లాలో పార్టీ పరిస్థితి  పేరు గొప్ప ఊరు దిబ్బ  అనే  చందంగా తయారైంది. జిల్లాలో బీజేపీ బతికి బట్టకట్ట  లేకపోవడానికి  కూడా అనేకానేక కారణాలున్నాయి. దరిమిలా రాజకీయంగా ఆ పార్టీ జిల్లాలో సత్తా చూపించే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. కనీసం పార్టీ అనేది ఒకటుందని కూడా  అగుపించడం లేదు.

ఎవడికి వాడు రాజకీయంగా కాషాయం కండువా మెళ్ళో  కప్పుకుంటూ వ్యక్తిగతంగా తమ ఉనికిని చాటు కోవడానికి  తాపత్రయపడుతున్నారే తప్ప పార్టీ కోసం ఎవడూ ఆలోచించడం లేదు. పార్టీని ఉద్ధరించే దిశగా ప్రయత్నమూ చెయ్యడం లేదు. ఇందుకు పూర్వాశ్రమంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతుతున్న పరిణామాలే నిదర్శనం. జిల్లా కేంద్రంలోని  నాగవంశం వీధిలో కాళ్ళ నారాయణ రావు అంశంలో పార్టీ ఏం చేసింది? ఏం  చెయ్యగలిగింది?  అప్పట్లో ఒకరిద్దరు స్పందించారే గానీ మిగతా వాళ్ళు ఏమయ్యారు? ఆ రోజు తర్వాత నారాయణ రావును పట్టించుకున్న  నాథుడే లేడు.

మాజీ మంత్రి  పైడికొండల మాణిక్యాల రావు మృతికి జిల్లా నేతలంతా కలిసి ఒకే వేదిక పై చేరి సంతాపం ప్రకటించలేక పోయారు. దివంగత నేతకు కలసికట్టుగా ఓ దండ వేయలేకపోయారు. కనీసం తామైనా ఏదో చేద్దామని వెళ్ళిన కార్యకర్తలను పార్టీ ఆఫీసులో తాళాలు వెక్కిరించాయి. దివంగత నేతకు నివాళులు అర్పించి వెళ్ళిపోతామని పార్టీ నాయకులు,  కార్యకర్తలు ఎంత బతిమాలినా,  కార్యాలయం తాళం తియ్యకుండా  అక్కడి కాపలాదారు ససేమిరా అన్నాడని సదరు కరడు గట్టిన బీజేపీ వాళ్ళంతా వాపోతున్నారు. జిల్లా అధ్యక్షులు కార్యాలయం తాళాలు ఎవరికీ ఇవ్వొద్దన్నారని, తలుపు తెరిచే ప్రసక్తే లేదని కాపలాదారు చెబితే వాళ్ళంతా  ఎవడికీ చెప్పుకోలేక  ఆఫీస్ గేటుకే మాణిక్యాల రావు ఫొటో తగిలించి,  దానికే ఓ దండేసి,  ఓ  దణ్ణం పెట్టి వెనుదిరిగారు. జిల్లా బీజేపీలో బవిరెడ్డి ప్రసాద రెడ్డి, పాకలపాటి సన్యాసి రాజు,  కుసుమంచి సుబ్బారావు,  రెడ్డి పావని,  రామకృష్ణ రాజు,  దేవర ఈశ్వరరావు సహా సీనియర్లు వృద్ధులు చాలా మందే ఉన్నారు. కానీ ఎవరి దారి వాళ్ళదే -ఎవడి గోల వాడిదే.

బవిరెడ్డి శివప్రసాద్ దివంగత పైడికొండల మాణిక్యాలరావుకి పార్టీ ఆఫీస్‌లో కాకుండా తన స్వంత కార్యాలయంలో నివాళులు అర్పించారు.  జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని ఒక రోజు గడిచిపోయాక గజపతినగరంలోని తన స్వగృహంలో పైడికొండల మాణిక్యాల రావుకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పట్టుమని పది మంది కూడా లేరు.  పది మంది సంగతి దేవుడెరుగు.. కనీసం అదే నియోజకవర్గంలో ఉండే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవర ఈశ్వరరావు సహా పార్టీకి చెందిన వాళ్ళెవరూ లేరు.  అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనుల శంఖుస్థాపన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు కూడా ఇలాగే జరిగాయి.

బవిరెడ్డి రామతీర్థంలోను,  రెడ్డి పావని తన గృహంలోనూ తమ తమ వందిమాగధులతో కార్యక్రమాలు నిర్వహించారు. పాకలపాటి సన్యాసిరాజు ఇవేమీ పట్టనట్టు పూర్వాశ్రమంలో జరిగిన సంఘటనలు,  సన్నివేశాలను అనుసరిస్తూ పార్టీ హై కమాండ్ ఆదేశించిన ప్రకారం భవన నిర్మాణ పనుల్లో మునిగిపోయారు.  వీళ్ళంతా పార్టీ కార్యాలయంలో కాకుండా ఎవరికి వాళ్ళుగా తమ తమ ఇళ్ళల్లోనో,  ఆఫీసుల్లోనో కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నారో,  పార్టీ కార్యాలయం అసలు ఎవడి కోసం  ఎందుకు కట్టారో ఎవడికీ అర్ధం కావడం లేదు. ఏమైనా అంటే  కరోనా అంటున్నారు.

సునీల్ దియోధర్ జిల్లాకి వచ్చినప్పుడు  పార్టీ కార్యాలయం తెరిచారు. అక్కడే మీటింగ్ పెట్టారు. అప్పుడు రాని కరోనా,   జిల్లా కేంద్రంలోని పెద్దలకు రాఖీ కట్టినప్పుడు రాలేని కరోనా దివంగత మాణిక్యాల రావుకు నివాళి అర్పించేప్పుడు,  అయోధ్య కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించేప్పుడు మాత్రమే వస్తుందా,  వచ్చేస్తుందా? తగిన జాగ్రత్తలతో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు కదా? ఇలాంటి వాటన్నింటినీ బలపరుస్తూ కోట జంక్షన్ లో ఓ ఫ్లెక్సీ వెలిసింది. దీనిలో జాతీయ నేతల ఫోటోలు పెట్టారు గానీ కనీసం ప్రోటోకాల్ కోసమైనా జిల్లాకు చెందిన ఓ ఇద్దరు ఫొటోలు ఓ మూలైనా పెట్టలేదు.

జిల్లాలో బీజేపీ పరిస్థితిని పరిశీలిస్తే సాధారణ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలుపుకునే స్థాయి కూడా లేదు. దీనంతటీకీ జిల్లా పార్టీ సీనియర్ల పోకడే కారణమని కార్యకర్తలు వాపోతున్నారు. అలానే ఎవరికి వారుగా ఒకరిపై ఒకరు రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అధిష్టానం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో తమ గోడు ఎవరికి వెళ్లబుచ్చుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో జిల్లా కేడర్ కొట్టుమిట్టాడుతోంది. ఇలా గ్రూపు తగాదాలతో కొట్టుకుంటున్న పార్టీ నాయకులతోనే.. సోము వీర్రాజు తాను డాంబికంగా ప్రకటిస్తున్నట్టుగా.. పార్టీని 2024లో అధికారంలోకి ఎలా తీసుకువస్తారో తెలియని సంగతి.

Tags: bjpEditorspickgroup politicsSomu Veerrajuvizayanagaram
Previous Post

నటరాజా.. శతసహస్ర ‘చిరు’తేజా… !

Next Post

డాడీ చిరుకు, సుస్మిత బర్త్ డే గిఫ్ట్ ఇదే!

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

‘జెర్సీ’దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన చరణ్?

భారత్‌కు త్వరలో mRNA కరోనా టీకాలు.. లుపిన్ ఫార్మా సన్నాహాలు

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

అమ్నేషియా పబ్ అత్యాచార ఘటనలో పోలీసులు సంచలన నిర్ణయం

ఏపీలో క్వాంటమ్ వ్యాలీ…. చంద్రబాబు ఐడియాకి టాటా సీఈవో ఫిదా..!!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బీసీ జనార్దన్ రెడ్డి అరెస్టు పై డీజీపీకి బాబు లేఖ : కర్నూల్ నేతలతో టెలి కాన్ఫరెన్స్

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

బాబు 2.0.. మీరు మారిపోయారు సార్‌.. అధికారులు, మంత్రులకి చెమటలు..!

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist