అమరావతి రైతులకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు . అలాగే జగన్ ప్రభుత్వానికి భారీ షాక్. ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. వెంటనే ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇండ్ల నిర్మాణాలపై స్టే విధిస్తూ జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ గడమాన్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు ఫుల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
అమరావతిలోని ఆర్5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలను నిలిపివేయాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత అనుబంధ పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడిస్తూ హైకోర్టులోని జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిలో ఆర్5 జోన్‌కు సంబంధించి సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించిన చట్టం 13/2022, జీఓ 45ను సవాలు చేస్తూ రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ, రైతు సంక్షేమ సంఘాలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి
ఇకనైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతి మీద కుట్రలు, కుతంత్రాలు ఆపాలని , అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా ఆమోదించాలని రైతులు వేడుకుంటున్నారు. ఎన్నో ఆశలతో అమరావతిని దేశంలోనే గొప్ప రాజధాని అవుతుందని ఆశపడ్డ ఆంధ్ర ప్రజలు, జగన్ ప్రభుత్వం అసలు రాజధాని లేకుండా చేస్తున్నారని రైతులు, ప్రజలు ఆవేదన చెందుతున్నారు.. ఇకనైనా జగన్ బుద్ధి తెచ్చుకొని అమరావతిని రాజధానిగా అంగీకరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కోర్టు సీఎం జగన్ కి ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన కూడా ఆయన మారే అవకాశం కనపడటం లేదు అని తెలుస్తోంది..