ప్రపంచంలోని కొన్ని దేశాలలో కొవిడ్-19 వ్యాప్తి, తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా, అమెరికాలో మాత్రం కరోనా రెండో విడత కూడా ప్రమాదకరంగా విస్తరిస్తుంది. ఈ మధ్య కాలంలోనే రోజుకు 5000-6000 మంది ప్రజలు కొవిడ్ దాటికి బలవుతున్నట్లు అధికారక లెక్కలు తెలియజేస్తున్నాయి. అంతేనా, దాదాపు ఒక్కరోజులో 70000 వేల మంది కొవిడ్ చికిత్స కోసం హాస్పిటల్ చేరినట్లు ఓ ప్రముఖ అమెరికన్ పత్రిక ప్రచురించడం కలకలం సృష్టిస్తుంది. కరోనా ప్రవేశించి సంవత్సర కాలం దాటుతున్నా, అమెరికా మాత్రం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలల్లాడుతోంది. అటువంటి అమెరికా ప్రజలకు అమెరికా ఎఫ్ డిఏ తియ్యటి కబురు అందించింది.
20 మిలియన్లే టార్గెట్
అమెరికాలో సోమవారం నుండి వ్యాక్సిన్‌ను ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల చివరికి దాదాపు 20 మిలియన్ల డోసులు అందించాలని టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం. ఫిబ్రవరి నాటికి 100 మిలియన్ల డోసులు అందించే ప్రయత్నంలో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. ముందుగా డాక్టర్స్, హెల్త వర్కర్స్ కి అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 21 రోజుల తేడాతో 2 డోసులు అందించాల్సి ఉంటుందని సంస్థ పేర్కోంది. అందుకోసం 16 నుండి 85 ఏళ్లు వ్యక్తులకు టీకాను అందించే ఏర్పాట్లు ముమ్మరం చేసింది సంస్థ. వీటిని ప్రజలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నంలో టీకా స్టోరేజ్, ప్రజలందరికి టీకాను వేయడం లాంటి వాటి గురించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం హాస్పిటల్స్ కి ఆదేశాలు జారీ చేసింది.
Must Read ;- ఫైజర్ మరో ముందడుగు.. భారత్ బయోటెక్ వైపే అందరి చూపు..
ప్రపంచానా.. అమెరికా పరిస్థితి వేరయా
ప్రపంచమంతా కరోనా రెండో విడత బాదుడు మొదలైనా కొన్ని దేశాలు మాత్రమే దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారత్ పరిస్థితే తీసుకుంటే, ఏవో కొన్ని రాష్ట్రాలు మినహా కొవిడ్ పరిస్థితి అదుపులోకి వచ్చిందనే చెప్పాలి. కానీ, అమెరికాలో పరిస్థితి అలా లేదు. ఇప్పటికీ కూడా అక్కడి పరిస్థితి భయానకంగా ఉందనే చెప్పాలి. రోజుకి మరణాలు 3000 నుండి 5000 దాటుతున్నాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితలు గమనించిన ప్రభుత్వం దేశీయ వ్యాక్సిన్ mRNA ఆధారిత ఫైజర్ వ్యాక్సిన్‌కి అనుమతులు ఇచ్చింది.
సమస్య తీరినట్టే
ప్రభుత్వ అంచనాల ప్రకారం ఫిబ్రవరి నాటికి 100 మిలియన్లు అందించగలిగితే, దాదాపు సమస్య సగం తీరినట్టే అనడంలో సందేహం లేదు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఒక్కటే.. ఫైజర్ ఎంతవరకు సమర్థవంతంగా పని చేస్తుందనేది అనేదానిపైన కేవలం అంచనాలు మాత్రమే ఉన్నాయి. ఫైజర్ అందరి అంచనాలను అందుకుంటూ.. కొవిడ్‌ని అదుపుచేయగలిగితే అమెరికా కరోనా కోరల నుండి తప్పించుకున్నట్లే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ALso Read ;- జీవనశైలి, రోగ నిరోధక శక్తి.. కరోనాకు ఆ నాలుగు పల్లెలు దూరం