అమెరికాలో పుట్టిన ఫైజర్‌కు దాదాపు 5 దేశాలు అనుమతులు ఇచ్చాయి. ఆయా దేశాల్లో ఫైజర్ మన్ననలు అందుకున్న తర్వాత, అమెరికా ఇప్పటికి కళ్లు తెరిచింది. మొత్తానికి మల్లగుల్లాలు పగి అత్యయిక పంపిణీకి ఫైజర్‌కు అనుమతులు ఇచ్చింది. మొదట డిసెంబర్ 14న మొదటి షాట్ ఇస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేశారు. తాజాగా ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా ఓ సంచలన ప్రకటన విడుదల చేశారు.
— Donald J. Trump (@realDonaldTrump) December 12, 2020
Must Read ;- అమెరికాలో ఫైజర్‌కు లైన్ క్లియర్
24 గంటల్లో సిద్దం చేయండి
అమెరికా ఫుడ్ & డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ అనుమతులు ఇవ్వడం ఆలస్యం, దాని కోసమే ఎదురుచూస్తున్నట్లుగా ఉన్నట్లుంది ట్రంప్ స్టేట్మెంట్. వెంటనే సోషల్ మీడియా వేదికగా ఫైజర్ టీకాను 24 గంటల్లోగా దేశ వ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. కొన్ని అమెరికన్ పత్రికల కథనం ప్రకారం, ట్రంప్ సర్కార్ ఫుడ్ & డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ని బెదిరించి మరి అనుమతులు వచ్చేలా చేశారని వెల్లడించారు.
100 మిలిమన్ల ప్రజల ఇవ్వడమే లక్ష్యం
ఫైజర్‌తో పాటు మోడార్నా టీకాను కూడా దాదాపు 200 మిలియన్లు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దీని ద్వారా 100 మిలియన్ల ప్రజలకు టీకాను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ప్రస్తుతం 30 మిలియన్ల కరోనా వారియర్స్‌కు ఫైజర్ ఇవ్వాల్సిందిగా నిర్ణయించినట్లు ప్రకటించింది.
Also Read ;- ఏ టీకా ఎంత ధర పలుకుతుందో తెలుసా?