హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఓడిపోవడం ఖాయం అని శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈటల టీఆర్‌ఎస్ నుంచి బయటకు వెళ్లి తనను తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని గుత్తా అన్నారు. నల్లగొండలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఈటల రాజేందర్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఆస్తుల రక్షణకే ఆయన బీజేపీలోకి వెళుతున్నారని ఆరోపించారు.భూ కబ్జా ఆరోపణలపై మంత్రి వర్గం నుంచి భర్తరప్ అయిన ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Must Read ;- ప్రజాస్వామ్య బద్ధంగా హుజూరాబాద్‌లో గెలవండి.. టీఆర్‌ఎస్‌కు ఈటల సవాల్











