రాజేందర్ కుటుంబం ప్రభుత్వ దేవాదాయ భూములను తనఖా పెట్టి కెనరా బ్యాంక్ నుండి పెద్ద ఎత్తున రుణాలు పొందారని అడ్వకేట్ రామారావు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు, తీవ్ర ఆర్థిక నేరాల పరిశోధన సంస్థకు ఫిర్యాదు చేశారు. ఈటల రాజేందర్ భార్య జమున, కుమారుడు ఈటల నితిన్, కుమార్తె క్షమితపై ఆయన ఫిర్యాదు చేశారు. దేవరయాంజల్ సర్వే నెంబర్ 56, 57 58 లలో ఉన్నసీతారామచంద్ర స్వామి భూములను ఈటల జమున పేరున అక్రమ రిజిస్ట్రేషన్ చేయించి పెద్ద ఎత్తున బ్యాంక్ రుణాలు పొందారని తెలిపారు. దీనిపై విచారణ చేయించాలని హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టిన ఈ భూములతో తన సంస్థ జమునా హేచరీస్‌కు కెనరా బ్యాంకు ద్వారా రూ.28 కోట్ల రుణం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
Must Read ;- ప్రజాస్వామ్య బద్ధంగా హుజూరాబాద్‌లో గెలవండి.. టీఆర్‌ఎస్‌కు ఈటల సవాల్











