పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన తదుపరి చిత్రంపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం పవన్ . ఒకేసారి క్రిష్ ‘హరిహర వీరమల్లు’, సాగర్ కె చంద్ర .. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ రీమేక్ మూవీస్ ను ఒకేసారి ట్రాక్ మీద పెట్టిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలూ పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్నాయి. కరోనా కారణంగా ఈ రెండు సినిమాల షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
లాక్ డౌన్ అనంతరం ఈ రెండు సినిమా షూటింగ్స్ తిరిగి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నాయి. ఇక వీటిలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాను ముందుగా విడుదల చేసే ఆలోచనతో ఉన్నారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే.. హరిహర వీరమల్లు మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తారట. ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ.. వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోయే సినిమా గురించి ఇప్పటినుంచి సంబరాలు చేసుకుంటున్నారు.
Must Read ;- మరోసారి పవర్ స్టార్ సరసన సామ్ ?