తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. చంద్రబాబుపై ఎప్పుడూ విమర్శలు గుప్పించే BRS లీడర్లు కేటీఆర్, హరీష్ రావు ఈ మధ్య స్టైల్ మార్చారు. చంద్రబాబు పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఇద్దరు నేతల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పొరుగు రాష్ట్రం నేతలు చంద్రబాబు పరిపాలనను ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో హరీష్ రావు మాట్లాడుతూ..కృష్ణా బేసిన్‌లో లేకపోయినా కుప్పంకు చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తున్నారని, ఎల్‌నినో లాంటి కష్టకాలంలో పట్టిసీమతో గోదావరి జలాలను కృష్ణాలోకి మళ్లించి రైతుల కష్టాలు తీర్చారంటూ చెప్పారు. ఇక మరోవైపు కేటీఆర్ సైతం ఏపీలో చంద్రబాబు పాలన బాగా సాగుతోందని, తెలంగాణతో పోలిస్తే అక్కడికే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని గతంలోనే ఓపెన్‌గా స్టేట్‌మెంట్స్ ఇచ్చారు.
ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో మాత్రం తీవ్ర కలకలం రేపాయి. తమ రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబును, అదీ పక్క రాష్ట్ర నేతలు, తనకు సన్నిహితంగా ఉండే BRS నేతలు ఇలా బహిరంగంగా ప్రశంసించడంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కామెంట్స్ వెనుక అసలు మతలబు ఏంటనే దానిపై ఆయన తన సన్నిహితుల దగ్గర గట్టిగానే అసంతృప్తి వెళ్లగక్కినట్లు సమాచారం. ఏపీలో వైసీపీ ఎప్పుడూ టీడీపీ విధానాలను, చంద్రబాబు పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, సరిహద్దు రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ నేతలు ఇలా మాట్లాడటం వల్ల తమ పార్టీ పోరాట నరేటివ్‌పై ప్రభావం పడుతుందని జగన్ భావిస్తున్నారట.
ఎవరు ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ, ఇటీవల బీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రత్యర్థి పార్టీ లీడర్లే చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్‌ను పొగుడుతుంటే, ఇటు వైసీపీ శ్రేణుల్లో మాత్రం రకరకాల చర్చలు నడుస్తున్నాయి.











