ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. హత్రాస్ రేప్ కేసులో బాధితురాలి తండ్రిని నిందితుడు అత్యంత దారుణంగా కాల్చి చంపాడు. రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. హత్రాస్‌లో దళిత యువతిపై అత్యంత దారుణంగా అత్యచారం చేయడమే కాకుండా తీవ్రంగా గాయపరిచారు నిందితులు. అప్పట్లో ఈ సంఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అధికార భారతీయ జనతా పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది.
ప్రతి పక్షాల ఆందోళనలతో..
ప్రతిపక్షాల ఆందోళనకు తలొగ్గిన యోగి సర్కార్ కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది. కట్ చేస్తే అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తులు వల్ల తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పలుమార్లు ప్రభుత్వానికి , పోలీసులకు బాధిత కుటుంబం మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అత్యాచారం కేసులో ఎలాగైనా తనకు శిక్ష పడటం ఖాయమని భావించిన నిందితుడు బాధితురాలి తండ్రిని కాల్చి చంపాడు. దాంతో హత్రాస్ లో మళ్ళీ ఆందోళనలు మొదలయ్యాయి. తమ కుటుంబానికి తగిన భద్రత కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేసినప్పటికీ యోగి సర్కార్ మాత్రం పట్టించుకోలేదని కన్నీళ్ల పర్యంతం అయ్యారు బాధిత కుటుంబ సభ్యులు.
అయితే ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాల కేసులు పెద్ద ఎత్తున నమోదు అవుతుండటంతో కలత చెందిన యోగి సర్కార్ కఠిన చర్యలకు దిగుతోంది. ఈ కేసుని కూడా ఎన్‌ఐఏ కు అప్పగించారు యోగి. ఈ సంఘటనలో ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా ఉపేక్షించేది లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ హెచ్చరించారు.











