ప్రపంచంలో మృత్యువు ఎప్పుడు..ఎలా వస్తుంది ఇప్పటివరకు అంతు చిక్కలేదు. విశ్వంపై సైన్స్ కి అందని అంతుచిక్కని రహస్యాలు చాలానే ఉన్నాయి.. బహుశా ఈ ఘటనకూడా అదే జాబితాలో చేరుతుందేమో.. ఎందుకంటే.. చనిపోయి..45నిమిషాల తరువాత బతికిన మనిషి మళ్లీ బతికి రావడం సినిమాల్లో తప్ప నిజజీవితంలో చూసి ఉండం..అలాంటి ఘటనే అమెరికాలో జరిగింది.
ఓ ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తి గుండె 45 నిమిషాల పాటు ఆగింది. వైద్యులు పలురకాలుగా ప్రయత్నాలు చేయడంతో మళ్లీ ఆ గుండె కొట్టుకుంది. అమెరికాలోని మైకేల్ నాపిన్కీ అనే 45 ఏళ్ల అమెరికన్.. నవంబరు 7న స్నేహితుడితో కలసి స్కీయింగ్ కి మౌంట్ రెయినైర్ నేషనల్ పార్క్ కి వెళ్లారు. కాసేపట్లో ఆ టాస్క్ ముగుస్తుందగా వాతావరణం మారిపోయింది. ఉష్టోగ్రత మైనస్ -8.9 డిగ్రీలకు పడిపోయింది. భారీగా మంచుకురవడం మొదలైంది. అయితే మైకేల్ తిరిగి తన ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆయన స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైకేల్ ని కనిపెట్టేందుకు మూడు టీంలు ఏర్పాటుచేశారు. హెలీకాప్టర్ల ద్వారా అన్వేషించారు. చివరికి ఓ చోట కనిపెట్టారు. వెంటనే అతడిని హార్బర్ వ్యూ మెడికల్ ఆసుపత్రికి తీసకెళ్లారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న మైకెల్ గుండె సడెన్ గా కొట్టుకోవడం ఆగిపోయింది. ఆయన చనిపోయాడని అంతా భావించారు. అయే వైద్యులు కృత్రిమ పద్దతులతో చికిత్స చేయడం మొదలుపెట్టారు. ఆధునిక పరికరాలతో గుండె, ఊపిరితిత్తులకు చికిత్స చేయడం మొదలుపెట్టారు. అలా 45నిమిషాల పాటు చికిత్స చేశాక.. మళ్లీ ఆయన గుండె కొట్టుకోవడం మొదలైంది. అంతకుముందే మైకెల్ కి గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్టు గుర్తించారు. చికిత్స అనంతరం ఆయన గుండె కొట్టుకోవడం మొదలైనా.. దాదాపు రెండు రోజుల తరువాత ఆయన స్పృహలోకి వచ్చాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షేమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. తన ప్రాణం పోయినా.. మళ్లీ పోరాడి తనకు పునర్జన్మ ఇచ్చిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపాడు మైకేల్.
ఇక ఆరోజు ఘటన విషయానికి వస్తే..ఆ రోజు తాను పర్వతం నుంచి దిగడం కష్టంగా కనిపించింది. కదలలేకపోతున్న విషయం మాత్రమే గుర్తుందని చెప్పాడు. ఆ తరువాత తనకు ఏం జరిగిందో తెలియని వ్కాయ్నించాడు. ఆయనకు చికిత్స అందించిన టీంలోని వైద్యు డా.జానెల్ బద్లక్ మాట్లాడుతూ ఆయన గుండె ఆగిపోయినా..అత్యవసర పద్ధతిని వినియోగించాం. సీపీఆర్ ద్వారా చికిత్స అందించాం. గుండె పనిచేసేందుకు వీలు కల్గించే ECMO ద్వారా రక్తాన్ని ఆయన బాడీనుంచి..గుండెకు పంప్ అయ్యేలా చూశామని చెప్పారు. దీంతో గుండెలో రక్త ప్రసరణకు అడ్డుగా ఉన్న కార్డన్ డయాక్సైడ్ తొలగిందని చెప్పారు. ఇదంతా అయ్యేందుకు దాదాపు 45 నిమిషాల సమయం పట్టిందని డా. జానెల్ వ్యాఖ్యానించారు. ఇక మైకెల్ భావోద్వేగంతో మీడియాతో మాట్లాడారు. తాను ప్రజలకు సేవచేయడమే లక్ష్యంగా తాను తదుపరి జీవితం కొనసాగిస్తానని పేర్కొన్నాడు.
వైద్యు సహకారంతో ఆయన బతికినా.. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన అంశంగా మారింది. ప్రపంచంలో చనిపోయినట్లు ధ్రువీకరించి..మళ్లీ బతికి వ్యక్తి.. మైకెల్ నాపిన్కీ ఒక్కడే కావచ్చు.