భలే ఛాన్సులే.. లక్కీ ఛాన్సులే.. ఇప్పుడు ఇదే పాట పాడుకుంటూ ఆనందంతో మెరిసిపోతోంది అందాల భామ ప్రియాంక అరుళ్ మోహన్. అవకాశాల విషయంలో లక్కీఛాన్స్ కొట్టేసిందామె. వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ఈ భామకు గ్లామర్ పరంగానే కాదు అభినయపరంగా కూడా మంచి మార్కులే లభించాయి. అదే సమయంలో శర్వానంద్ సరసన శ్రీకారం చిత్రంలో నటించే అవకాశం కూడా ప్రియాంకను వెతుక్కుంటూ వచ్చింది. బెంగళూర్లో పుట్టి, పెరిగిన ఆమె విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది.
తన మాతృభాషకు చెందిన శాండిల్ వుడ్లో అవకాశాలు రాకపోయినా తెలుగు చిత్ర పరిశ్రమ ఆమెకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. కన్నడ, తెలుగు భాషల కు చాలా సామీప్యం ఉండటంతో తాను తెలుగు భాషను చాలా తొందరగా అర్ధం చేసుకోగలుగుతున్నానని ఆమె అంటోంది. గ్యాంగ్ లీడర్ అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా ఆమె లోని నటనకు మంచి మార్కులే లభించాయి. తాజాగా నటించిన శ్రీకారం చిత్రంలోని హీరోయిన్ పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరింపజేస్తుందని చెబుతోంది.
ఇందులో శర్వానంద్ రైతు పాత్రను పోషిస్తున్నారు. ఇంకోవైపు తమిళంలో శివకార్తికేయన్, దర్శకుడు నెల్సన్ కలయికలో ఇప్పటికే రూపొందుతున్న చిత్రంలో కూడా ప్రియాంక నటిస్తోంది ఇప్పటి వరకు ఆమె నటించిన ఒకేఒక చిత్రం విడుదలైనప్పటికీ, ఈ భామ పేరు బాగానే మారుమోగుతోంది. అవకాశాలపై అవకాశాలు వస్తుండటమే అందుకు కారణం. తాజాగా ఓ మంచి అవకాశాన్ని ప్రియాంక దక్కించుకుంది.
నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే నూతన చిత్రం `థాంక్యూ `లో ఆమెకు అవకాశం లభించింది. డిసెంబర్ నుంచి ఈ చిత్రం మొదలవుతుందని సమాచారం. తెలుగులో తనకు తోలి అవకాశాన్ని ఇచ్చిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలోనే మళ్లీ నటించే అవకాశం రావడం పట్ల ఆమె ఎనలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు ఇతర ఏ భాషలలో అవకాశాలు లభించినా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రియాంక స్పష్టం చేసింది.
Must Read ;- శర్వానంద్ కు జోడీగా కన్నడ బ్యూటీ











