ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం గొల్లవెల్లి గ్రామంలో ఎక్కువగా మరణాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. ఉప్పలగుప్తం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గడిచిన పది రోజుల్లో సుమారు ఇరవై నుండి 30 మంది వరకు కరోనా తో మృతి చెందారు. సగానిపై గ్రామస్తులు కరోనా బారిన పడ్డట్టు వార్తలు వస్తుండటంతో, ఇతర గ్రామస్తులు ఎవరూ ఆ ఊరికి రావడం లేదు. కనీసం చిరువ్యాపారులు కూడా రాకపోవడంతో నిత్యవసరాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వైద్య సదుపాయాలు, ఇతర కనీస అవసరాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!
మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...










