గత రెండేళ్ళుగా హైద్రాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ లిస్ట్ లో .. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నెం.1 గా నిలుస్తున్నాడు. ఈ ఏడాది కూడా అతడు అదే స్థానంలో కొనసాగడం పెద్ద విడ్డూరంగా అనిపించలేదు కానీ.. మిగిలిన స్థానాల్లో మాత్రం కొద్ది పాటి మార్పులు కనిపించాయి. అందులో పలువురు హీరోల పేర్లు అనూహ్యంగా కినిపించి సర్ ప్రైజ్ చేశాయి. వారిలో యంగ్ హీరో నాగశౌర్య ఒకడు.
గత ఏడాది అసలేమాత్రం లిస్ట్ లోకి శౌర్య .. ఏసారి ఏకంగా ఐదవ స్థానంలో నిలవడం నిజంగా అభినందించదగ్గ విషయం. నాగశౌర్య త్వరలో విడుదల కానున్న ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్ బాడీ బిల్డ్ చేసి .. షాకింగ్ మేకోవర్ తో కనిపించబోతున్నాడు. గత ఏడాది నుంచి వరుసగా సినిమాలు అనౌన్స్ చేసి వార్తల్లో నిలిచాడు. అందుకే ఈ సారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా ఐదవ స్థానం దక్కించుకున్నాడు.
ప్రస్తుతం నాగశౌర్య సంతోష్ జాగర్లపూడి లక్ష్య మూవీతో పాటు .. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ‘వరుడుకావలెను’ , అలాగే.. ‘పోలీసువారి హెచ్చరిక’ అనే క్రైమ్ మూవీకి కూడా కమిట్ అయ్యాడు. అలాగే.. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ లాంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో నాగశౌర్య మరో ఏడాది పాటు ఊపిరి సలపనంత బిజీగా మారబోతున్నాడు. వీటితో అతడు దర్శకులకు మోస్ట్ డిజైరబుల్ హీరో కూడా అయ్యాడన్నమాట.