కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటం,దేశీయంగా నెలకు కేవలం 8 కోట్ల టీకాలే ఉత్పత్తి అవుతుండటంతో అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.కేవలం దేశీయ వ్యాక్సిన్లపైనే ఆధారపడితే అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు సంవత్సర కాలం పట్టేలా ఉంది.అందుకే విదేశాల్లో తయారు చేసి,అక్కడ కోట్లాది మందికి వినియోగించిన టీకాలకు దేశీయంగా జరిపే బ్రిడ్జి ట్రయల్స్ అవసరం లేకుండానే అనుమతించాలని డీసీజీఐ ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి టీకాల దిగుమతికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఛీప్ వి.జి.సోమని తెలిపారు.అయితే అమెరికాలో ఎఫ్‌డీఏ మాదిరి,ఆయా దేశాల్లో పలు ప్రభుత్వ సంస్థల అనుమతులు తప్పనిసరని సోమని స్పష్టం చేశారు.
ఫైజర్,మోడెర్నా టీకాల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్
అమెరికాలో పెద్ద ఎత్తున టీకాలు ఉత్పత్తి చేస్తున్న ఫైజర్,మోడెర్నా టీకాల దిగుమతులకు ఇండెమ్నిటీ అడ్డంకిగా మారింది.అంటే ఆయా టీకాల వినియోగం వల్ల ప్రజల ప్రాణాలకు ఏమైనా నష్టం వాటిల్లితే ఆయా కంపెనీలు పెద్ద ఎత్తున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇండెమ్నిటీ సమస్య కూడా తొలగిపోయింది.ఫైజర్,మోడెర్నా టీకాలు ఇప్పటికే కోట్ల మందికి ఇచ్చారు,కాబట్టి ఏదైనా జరగరానిది జరిగినా కంపెనీ బాధ్యత వహించే పని లేకుండా అనుమతించారు.దీంతో ఆయా కంపెనీల టీకాలకు లైన్ క్లియర్ అయిందనే చెప్పవచ్చు. డిసెంబరు నాటికి అందరికీ టీకాలు వేయాలంటే సుమారు 120 కోట్ల డోసులు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.ఆగష్టు నుంచి దేశీయంగా కూడా రోజుకు కోటి టీకాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేస్తున్నారు.ఇదే జరిగితే డిసెంబరు నాటికి దేశంలో అందరికీ రెండు డోసుల టీకాలు అందే అవకాశం ఉంది.
Must Read ;- ఆ ఔషధం.. గర్భిణులకు ఇవ్వకూడదు











