సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ లయ అందరికీ సూపరిచితురాలే. పదహారణాల తెలుగమ్మాయిగా పేరుతెచ్చుకున్న లయ ఆ సినిమా తర్వాత ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా మానవహారం, ప్రేమించు, మిస్సమ్మ, స్వరాభిషేకం, టాటా బిర్లా మధ్యలో లైలా ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తెలుగు ఆడియెన్స్ మన్ననలను పొందారు లయ.
ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే 22 ఏళ్ళ లయ పెళ్లి చేసుకుని ఇండస్ట్రిని విడిచిపెట్టారు. ఒక డాక్టర్ ని వివాహం చేసుకున్న ఆమె ప్రస్తుతం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. మూడేళ్ల క్రితం రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం అతిథిగా నటించారు. ఆ తర్వాత ఆమె మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న లయ తనకు నచ్చిన పాటల్ని రీల్స్ చేసి నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు. ఇటీవల కళావతి సాంగ్ కు డాన్స్ చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఇక తాజాగా తెలుగులో సూపర్ మాస సాంగ్ గా అందరి నోట వినిపిస్తున్న డీజే టిల్లు పాటకు ఆమె తనదైన మాస్ స్టెప్పులేసి సందడి చేశారు. తన స్నేహితురాలితో కలిసి ఆమె చేసిన ఈ పాట వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
ఇక లయ వీడియోతో పాటు తన బాలయ్య మిత్రులను కలిసినప్పుడు ఇలా సరదాగా డాన్స్ చేయాలి అనిపిస్తుంది అని పోస్ట్ కూడా దానికి జాతచేయడంతో ఆమె అభిమానులు సంబరపడిపోతున్నారు. మరికొందరు మాత్రం మీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాం అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి లయ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా ? ఆమె నిర్ణయం ఏమిటి అనేది ఆమె చెప్పాలి.