మున్సిపల్ ఎన్నికల్లో వలంటీర్ల సేవలపై, రీ నామినేషన్లకు ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది.
మున్సిపల్ ఎన్నికల సందర్బంగా వలంటీర్ల వద్ద ఉన్న ట్యాబ్ లు దుర్వినియోగం కాకుండా స్వాధీనం చేసుకోవాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక తిరుపతి,రాయచోటి , పుంగనూరు ,ఎర్రగుంట్లలో 14వార్డులకు రీ నామినేషన్లకు కూడా ఎస్‌ఈసీ అనుమతి ఇచ్చారు. ఎస్ఈసీ నిర్ణయాలను సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు ఎస్‌ఈసీ ఆదేశాలను కొట్టివేసింది.
372 గ్రామ పంచాయతీల ఎన్నికలకు నోటిఫికేషన్ ..
గత నెలలో ఏపీలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగినా 372 గ్రామ పంచాయతీల్లో సాంకేతిక కారణాల వల్ల , బ్యాలెట్ పేపర్ల ముద్రణలో తప్పులు దొర్లడం వల్ల అక్కడ వాయిదా వేశారు. తాజాగా ఆ 372 పంచాయతీల ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ గ్రామ పంచాయతీల్లో ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేయవచ్చు. మార్చి 15న ఈ 372 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు.