తిరుపతి ఎంపీ సీటును పోత్తులో భాగంగా జనసేనకు కేటాయించేందుకు బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఆ పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీ నాయకత్వం తిరుపతిలో తమ నాయకుడినే బరిలోకి దించాలని అధిష్టానానికి సూచించింది. అయితే ఆపార్టీ కేంద్ర నాయకత్వం తమకు అత్యంత సన్నిహితులతో చేయించుకున్న సర్వే లు, ఏపీ బీజేపీ నాయకులు చెప్పిన దానికి భిన్నంగా ఉండటంతో బీజేపీ కేంద్ర నాయకత్వం జనసేనకు కేటాయించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు అయినట్టు బీజీపీలో చర్చ జరుగుతోంది. ఇంతే కాకుండా జనసేన పార్టీ టీడీపీకు దగ్గర అవుతోందనే ప్రచారంతో బీజేపీ కేంద్ర నాయకులు అప్రమత్తమైనట్లు వినికిడి. ఈ రెండు పార్టీల మధ్య మైత్రి కుదిరితే ఏపీలో బీజేపీ ఒంటరి అవుతుందని గ్రహించే ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులు, తిరుపతిలో ఓటు బ్యాంక్‌ను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తిరుపతి సీటు జనసేనకు కేటాయించబోతున్నట్లు సమాచారం.
Also Read : అటు మమత విమర్శలు.. ఇటు తిరుపతి,సాగర్ షెడ్యూల్ జాప్యం..?