ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, మత మార్పిడిల గురించి రాజా సింగ్ మాట్లాడుతూ.. ‘అక్కడి బీజేపీ నాయకుల గురించి నాకు అంతగా తెలియదు. ఈరోజు కూడా నా ఫోన్ కు ఒక వీడియో వచ్చింది. అందులో కడప నుంచి అవులను తరిలిస్తున్నారు. ఆ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలపై వేధింపులకు కూడా పాల్పడుతున్నారు. ఆవు మాంసాన్ని తెలంగాణకు కూడా తరలిస్తున్నట్లుగా నాకు సమాచారం ఉంది. మత మార్పిడిలపై మేము పోరాటం చేస్తాము. అక్కడ ఊళ్లకు ఊళ్లనే వాళ్ల మత మార్పిడిలో భాగం చేస్తున్నారు. అక్కడి బీజేపీ నాయకులు వీటిపై ఎందుకు స్పందించడం లేదో నాకు తెలియదు. పార్టీ అనుమతిస్తే.. ఏపీలో కూడా ధర్మ ప్రచారానికి.. గోరక్షణకు పూనుకుంటాను.’
‘ఇక దేవాలయాల విషయానికొస్తే.. వైసీపీ పార్టీ ఏపీలో హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తుందనే మాట 100 శాతం నిజం. ఇప్పటి వరకు గుళ్లపై జరిగిన దాడుల్లో ఎంతమందిని అరెస్ట్ చేశారు. ఒక్క పాస్లర్ ప్లాన్ చేసి గుళ్లపైన దాడులు చేశాడని తెలిసినా.. ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. జగన్ సీఎంగా కొనసాగటం హిందువులకు నష్టం. జగన్ మాత్రమే కాదు.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా హిందువులకు ఎంత నష్టం చేశారనేది చరిత్ర చూస్తే తెలుస్తుంది’ అని రాజా సింగ్ అనడం సంచలనంగా మారింది.