మైత్రీ మూవీస్.. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తున్న టాప్ ప్రొడక్షన్ హౌస్. సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈ భారీ చిత్రం నిర్మాణంలో ఉంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో మూవీ కూడా నిర్మిస్తుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని త్వరలో స్టార్ట్ చేయనుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్ లో మూవీని కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మిస్తుంది.
ఇలా టాలీవుడ్ లో టాప్ స్టార్స్ తో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ తమిళ సూపర్ స్టార్ విజయ్ తో ఓ సినిమా చేయబోతుంది. ఇప్పటికే విజయ్ తో మైత్రీ మూవీస్ ఒప్పందం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళ్ లో రూపొందే ఈ భారీ చిత్రానికి దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే.. తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కి ఈ నిర్మాణ సంస్థ గతంలో అడ్వాన్స్ ఇచ్చింది.
విజయ్ – లోకేష్ కాంబినేషన్ లో ఇటీవలే మాస్టర్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. అందుచేత విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లోనే ఈ సినిమా చేస్తారా.? లేక వేరే డైరెక్టర్ తో ఈ సినిమాని చేస్తారా.? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తాజా సమాచారం ప్రకారం.. ఓ తెలుగు డైరెక్టర్ తో విజయ్ సినిమా చేయనున్నారని తెలిసింది. అయితే.. విజయ్ చేయనున్న ఆ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరు అనేది తెలియాల్సివుంది. టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఉన్న మైత్రీ ఇప్పుడు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండడం విశేషం.
Must Read ;- సూపర్ స్టార్ తో .. సూపర్ లేడీ డైరెక్టర్ ?