ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చింది. గతంలో ఆగిపోయిన వద్ద నుంచి కాకుండా తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసి, కనీసం నాలుగు వారాల గడువు ఇచ్చి ఎన్నికలు నిర్వహించేలా ఎస్‌ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. దీనిపై రెండు రోజుల పాటు విచారణ జరిపిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. పరిషత్ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. కనీసం నాలుగు వారాల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని హైకోర్టు గుర్తు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఆగిపోయిన వద్ద నుంచి పరిషత్ ఎన్నికలు పూర్తి చేసేందుకు ఈ నెల ఒకటిన ఎస్‌ఈ సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను నిలిపివేసింది.
4 వారాల సమయం తప్పనిసరి
నోటిఫికేషన్‌కు ఎన్నికలకు మధ్య కనీసం నాలుగు వారాల సమయం ఉండాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం గుర్తు చేసింది. ఇవాల్డితో ప్రచారం ముగించుకుని, రేపు ఎన్నికల సామాగ్రి తీసుకుని 8న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. హైకోర్టు తీర్పుతో పరిషత్ ఎన్నికలు ప్రస్తుతానికి నిలిచిపోయాయి.
Must Read ;- తగ్గని తెలుగు తమ్ముళ్లు.. పరిషత్ ఎన్నికల్లో పోటీకే సై











