వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామరాజు అరెస్టుపై ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో హైస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లో తన నివాసంలో రఘురామరాజును అరెస్టు చేసిన సీఐడీ గుంటూరులోని ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచలేదు.ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది.
కేసులు పెట్టడం కక్ష సాధింపే
ఎంపీ రఘురామరాజును అరెస్టు చేయడంపై పలు పార్టీల నేతలు తప్పుపట్టారు.ఏపీలో కరోనా కట్టడి వదిలేసి, రాజకీయకక్షతో రఘురామరాజను అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు.కరోనా కేసులు వదిలేసి రఘరామపై అక్రమ కేసులు పెట్టడానికి ఇది సరైన సమయమా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. రఘురామరాజు అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుపట్టారు.అక్రమ కేసులకు ఇది సమయం కాదన్నారు. రఘురామరాజు అరెస్టు కక్ష సాధింపు చర్యల్లో భాగమని,రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావడం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఏపీలో ఎమర్జెన్సీ నాటి పాలన తలపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.