ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పేదలకు సెంటు భూమి పంపిణీ అభాసుపాలవుతోంది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామంలో భూమి లేకుండానే పట్టాలు పంపిణీ చేశారు. పట్టాల పంపిణీ తరవాత తమకు ఇచ్చిన భూమి ఎక్కడో చూపించాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబును లబ్దిదారులు నిలదీయగా, వారికి సమాధానం చెప్పకుండా ఆయన చల్లగా అక్కడ నుంచి జారుకున్నారు.
సర్వే నెంబరు 507-1A లో భూమి ఉన్నట్టు రెవెన్యూ అధికారులు పట్టాలపై ముద్రించారు. ఆన్ లైన్ లో చెక్ చేయగా అసలు ఆ నంబరుతో భూమి కనిపించకపోవడంతో లబ్దిదారులు ఖంగుతిన్నారు. పంట కాలువకు పట్టాలకు పంపిణీ చేయడంపై లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కామెడీ అక్కడే జరగాలా…
నవ్వుల రారాజు బ్రహ్మానందం పుట్టిన గ్రామంలోనే వైసీపీ నేతలు పట్టాల పంపిణీని కామెడీగా మార్చారు. అసలు భూమి లేకుండా పట్టాలివ్వడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. భూమి లేకపోయినా జగనన్న నవ్వుతున్న ఫోటోలు ముద్రించిన పట్టాలను, భారీ సభ పెట్టి మరీ పంచడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట కాలువను పంచితే పొలాలకు నీరు ఎలా వస్తుందని రైతులు కూడా ఆందోళనకు దిగడం విశేషం.
Also Read: అంబటి రాంబాబు.. సూపర్ స్ప్రెడర్ అవుతారా?











