కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. అయితే సిటీ జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కీలక ప్రకటన చేశారు. మాస్కులు ధరించనివాళ్లకు ఫైన్ వేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోవాల్సిందేనన్నారు. ఫస్ట్ వేవ్ లో తెలంగాణ ప్రజలు కరోనా నిబంధనలు పాటించారని, సెకండ్ వేవ్ లో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వారం రోజుల తర్వాత జరిమానాలు విధిస్తామన్నారు. మాస్కులు పెట్టుకుంటూ, భౌతిక ధూరం పాటిస్తూ కొవిడ్ రూల్స్ కచ్చితంగా పాటించాలన్నారు.
Must Read ;- వ్యాపారులు.. అలర్ట్ : మాస్క్ లేకుంటే, 2 వేల ఫైన్