విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ మంగళవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉక్కు పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చని, నష్టాల సమస్యకు ప్రైవేటీకరణ పరిష్కారం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కార్మికుల ఉద్యమానికి మద్దతు
విశాఖ ఉక్కు.. ఆంధ్రా హక్కు నినాదంతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయెద్దంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కార్మికుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన లక్ష్మీనారాయణ … విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు, వివిధ పార్టీల నేతలతో లక్ష్మీనారాయణ సమాలోచనలు జరుపుతున్నారు.
Must Read ;- చిన్న చిన్న మార్పులతో విశాఖ ఉక్కు లాభాల్లోకి.. లక్ష్మీనారాయణ