రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకుంటోంది. కొవిడ్ నిబంధనల అమలులో భాగంగా.. మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రాంతాలు, ప్రజా రవాణా వాహనాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కు ధరించనివాళ్లపై కఠినంగా వ్యవహరిస్తోంది. షాపుల్లోకి మాస్కు లేనివారిని అనుమతి ఇస్తే.. షాపు ఓనర్లకు జరిమానా విధిస్తోంది. నిన్న ఫతేనగర్‌లో మాస్క్ లేకుండా కస్టమర్స్‌ను షాపులోకి అనుమతించిన ఓ షాపు యజమానికి 2 వేల జరిమానా విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. హోలీ మొదలుకొని షబ్-ఏ-బరాత్, ఉగాది, శ్రీరామనవమి, మహవీర్ జయంతి, గుడ్ ప్రైడే, రంజాన్ వేడుకలపైనా ఆంక్షలు విధించింది.
Must Read ;- అత్యవసరమైతే తప్ప… బయటకు రావొద్దు : కరోనాపై మంత్రి ఈటల సమీక్ష