జబర్దస్త్.. బుల్లితెరపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న షో ‘జబర్ధస్త్’. ఏడేళ్లుగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతోంది ఈ షో. అందులో హైపర్ ఆది టీంకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బుల్లితెర త్రివిక్రమ్ అంటూ హైపర్ ఆదిని ఆకాశానికెత్తేస్తుంటారు. అలాంటి హైపర్ ఆది తాజాగా అదిరింది, జబర్దస్త్ లపై హైపర్ సెట్టర్లు వేసాడు. వచ్చే వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో హైపర్ ఆది వేసిన సెటైర్లు మరింత చర్చకు వచ్చాయి. ఈసారి ఆది బిచ్చగాళ్ల వేషం వేశాడు. అయితే ఆ గెటప్‌లకు కూడా ఎంట్రీ సాంగ్ వేయించుకున్నాడు.
మనలాంటి అడుక్కునే వాళ్లకు కూడా ఎంట్రీసాంగ్ అవసరమా? అని శాంతి స్వరూప్ అంటాడు. అలా శాంతి స్వరూప్ అడగడంతో హైపర్ ఆది పంచ్‌ల ప్రవాహాన్ని వదిలాడు. ఈ ప్రపచంలో అడుక్కోని వారెవ్వరున్నారు. మనల్ని కామెడీ పెంచమని జడ్జ్‌లు అడుక్కుంటారు, పేమెంట్లు పెంచమని మనం అడుక్కుంటాము, వేరే షోలకు రమ్మని వాళ్లు అడుక్కుంటారు, వద్దు ఇక్కడే ఉండమని వీళ్లు అడుక్కుంటారు, మీరు మీరు కలిసి మమ్మల్ని మింగకండి అని మనం అడుక్కుంటాము అంటూ వరుసగా డైలాగ్‌లు చెప్పడంతో అందరూ పగల బడి నవ్వేశారు.
కానీ హైపర్ ఆది వేసిన ఆ సెటైరల్లో కొన్ని నిజాలు ఉన్నాయి. కామెడీ పెంచమనడం, పేమెంట్లను పెంచమనడం, అనసూయ క్లోజప్‌లు వేయమని అడుక్కోవడం వరకు అంతా కామెడీ కోసమే అయినా కూడా మిగతావి మాత్రం సీరియస్ పంచ్‌లని తెలుస్తోంది. ఎందుకంటే హైపర్ ఆదిని అదిరింది షోలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అసలే అదిరింది రూపు రేఖలు ప్రస్తుతం మారాయి. వర్షెన్ 2.ఓ లా అదిరింది కాస్తా బొమ్మ అదిరిందిగా మారింది. యాంకర్ రవి, భాను శ్రీలను పంపించేసి.. శ్రీముఖిని తెచ్చారు. నవదీప్‌కు గుడ్ బై చెప్పారు.. జానీ మాస్టర్‌కు వెల్కమ్ చెప్పారు. ఈ క్రమంలో హైపర్ ఆదిని కూడా పిలిచినట్టు టాక్. అందుకే ఈ రకమైన సెటైర్లు వేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద జబర్దస్త్, అదిరింది షో ల మధ్య పోటీ జబర్దస్త్ గా మారి .. అదిరింది కదూ…











