టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని గతంలో అరెస్ట్ చేసిన వ్యవహారంలో గత వైసీపీ సర్కారు నిజంగానే దుస్సాహసానికి ఒడిగట్టిందని చెప్పక తప్పదు. అప్పటికే 15 ఏళ్ల పాటు సీఎంగా, పదేళ్ల పాటు విపక్ష నేతగా వ్యవహరించి.. మరోమారు ప్రధాన ప్రతిపక్ష నేత హోాదాలో కొనసాగుతున్న చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు ముఖ్యంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజంగానే దుస్సాసానికి ఒడిగట్టారని చెప్పక తప్పదు. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా జగన్ చేస్తున్న దుస్సాహసం తెలిసి కూడా నాటి సీఐడీ అదికారులు ఆయన ఆదేశాలను పాటిస్తూ చంద్రబాబును అరెస్ట్ చేయడం మరింత దారుణమనే చెప్పాలి. మొత్తంగా జగన్ తన రాజకీయ కక్షసాదింపు కోసం తనకు దక్కిన పదవిని వినియోగిస్తే… ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం అర్రులు చాచే అధికారుల దుర్నీతి కారణంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని తాజాగా తేలిపోయింది. ఈ మేరకు నాడు చంద్రబాబు అరెస్ట్ కు దారి తీసిన పరిణామాలు, చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు వైసీపీ సర్కారు అనుసరించిన దుర్నీతి. అధికారుల బరితెగింపు వ్యవహారాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
2014-19 మధ్య కాలంలో కొనసాగిన స్కిల్ డెవలప్ మెంట్ పథకంలో టీడీపీ సర్కారు అవినీతికి పాల్పడిందంటూ వైసీపీ జామానాలో సీఐడీ ఓ కేసు నమోదు చేసింది ఈ కేసులో సీఐడీ అదికారులు నాడు విపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చంద్రబాబును తరలించిన పోలీసులు…ఆయనను ఏకంగా 53 రోజుల పాటు జైలులో ఉంచారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వడంతో చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే చంద్రబాబు అరెస్ట్ కు దారి తీసిన అసలు వాస్తవాలు బయటకు రాకుండా వైసీపీ సర్కారు జాగ్రత్తలు తీసుకుంది. తాజాగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఏపీ ప్రజలు రాజకీయ సమాధి కట్టడం, టీడీపీ నేతృత్వంలోని కూటమికి బంపర్ మెజారిటీ కట్టబెట్టడంతో తిరిగి చంద్రబాబు సీఎంగా కూటమి కొత్త సర్కారును ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నాడు చంద్రబాబు అరెస్ట్ కు దారి తీసిన అంశాలపై దృష్టి సారించిన కూటమి సర్కారు., పలు కీలక విషయాలను నిగ్గు తేల్చింది. సీఎం హోదాలో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకున్నా కూడా ఆయన తప్పు చేసినట్లుగా రికార్డులు మార్చివేసి ఆయనను అరెస్ట్ చేసినట్లుగా ఇప్పుడు తేలిపోయింది.
చంద్రబాబును అరెస్ట్ చేయడమే లక్ష్యంగా జగన్ సర్కారు సాగిందని తాజాగా వెల్లడన ఆధారాలతో తేలిపోయింది.ఇందులో భాగంగా ఓ సీనియర్ మోస్ట్ ఏఐఎస్ అధికారి ఇచ్చిన వాంగ్మూలాన్ని సదరు అధికారికి తెలియకుండానే జగన్ సర్కారు మార్చివేసింది. టీడీపీ గత హయాంలో ఏపీ ఆర్థిక శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అదికారి పీవీ రేమేశ్ వ్యవహరించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కీం నిధుల విడుదలలో అక్రమాలు జరిగాయంటూ ఆ తర్వాత అదికారం చేపట్టిన వైసీపీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది, ఈ విచారణలో భాగంగా పీవీ రేమేశ్ నుంచి విచారణాధికారులు వాంగ్మూలాన్ని సేకరించారు. ఒక పథకానికి లేదా ప్రాజెక్టుకు శాసనసభలో బడ్జెట్ ఆమోదం ఉన్నప్పుడు నిధుల విడుదలకు ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవు. ఏదైనా పని సత్వరం కావాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం రివాజు అని సదరు వాంగ్మూలంలో పీవీ రేమేశ్ వెల్లడించారు. ఈ లెక్కన స్కిల్ డెవలప్ మెంట్ స్కీంలో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదనే రమేశ్ వెల్లడించారు.
అయితే ఈ వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ చేయడం కుదరదు కదా. చంద్రబాబును అరెస్ట్ చేసేందుకే ఈ కేసుపై విచారణకు ఆదేశాలు జారీ చేశాం కదా… మరి ఇప్పుడు రమేశ్ ఇచ్చిన వాంగ్మూలంతో చంద్రబాబు అరెస్ట్ కుదరదు కదా అన్న దిశగా ఆలోచించిన వైసీపీ సర్కారు పెద్దలు… ఐఏఎస్ అధికారి అయిన పీవీ రమేశ్ వాంగ్మూలాన్నే మార్చివేసేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో స్కిల్ ప్రాజెక్టులో చెల్లింపులు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. నేను కుదరదని అభ్యంతరం చెబితే… నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు ఫోన్ చేసి ఒత్తిడి చేసి నిధులు విడదల చేయించారు అని రమేశ్ చెప్పినట్లుగా ఆయన వాంగ్మూలాన్ని మార్చివేశారు. వైసీపీ జమానాలోనూ కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించిన రమేశ్ కు కనీసం ఈ విషయం చెప్పకుండానే జగన్ సర్కారు వ్యవహారాన్ని నడిపింది. ఇప్పడు ఈ విషయం బయటపడటంతో తన వాంగ్మూలాన్నే మార్చివేసిన వైసీపీ సర్కారు తీరుపై రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రమేశ్ వాంగ్మూలాన్ని మార్చిందెవరు, ఆ దిశగా ఆదేశాలు జారీ చేసిందెవరన్న కోణంలో కూటమి సర్కారు సరికొత్త తరహాలో విచారణకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే… ఎంతమంది అదికారులు ఈ వ్యవహారంలో బలవుతారోనన్న అంశంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.