సాధారణంగా బ్యాంకు ఉద్యోగాలంటే.. సంవత్సరాల తరబడి కష్టపడినా ఒక్కోసారి వస్తుందనే నమ్మకం లేదు. పైగా బ్యాంకు ఇంటర్వ్యూ దాకా వెళ్లాలంటే.. ముందు ముఖ్యంగా రాత పరీక్షను నెగ్గాలి. అందులోనే చాలామంది బోల్తాకొడుతుంటారు. పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నించినా కూడా సఫలం కాలేని వారు ఎందరో.. అలాంటివారికో తీపి కబురు చెప్పింది. పరీక్ష లేకుండానే 2020-21 గాను ఎంపికలు చేయనున్నట్లు ప్రకటించింది.
వింటుంటేనే ఎంతో ఆనందంగా ఉంది అనుకుంటున్నారా? లేనిది రాత పరీక్ష మాత్రమే.. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యాలు ఉంటాయి. వాటిలో మంచి ప్రతిభ చూపించిన వారిని మాత్రమే ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది బ్యాంకు. ఈ ఎంపికకు 100 మార్కులు నిర్ణయించింది. ఇందులో బ్యాంకు నిబంధనల ప్రకారం ఉత్తీర్ణత పొందిన వారికి మాత్రం ఉద్యోగాలు వరిస్తాయి. మరి ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి నిబంధనలేమిటో చూద్దాం..
మొత్తం 134 పోస్టులు..
- నాలుగు పోస్టులను విడుదల చేసింది ఐడిబిఐ బ్యాంకు..
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ డి) – మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. ఇక కుల ప్రాతిపదికన వీటిని విభజిస్తారు.
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేడ్ సి) – మొత్తం 52 పోస్టులు.
- మేనేజర్ (గ్రేడ్ బి) – మొత్తం 62 పోస్టులు.
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేట్ ఎ) – మొత్తం 9 పోస్టులు.
పోస్టులను బట్టి వయసు కనిష్ఠంగా 21.. గరిష్ఠంగా 45 సంవత్సారాలుగా నిర్ణయించింది బ్యాంకు. ఇక పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే బ్యాంకు వెబ్ సైట్ లో పొందుపరిచిన పూర్తి వివరాలు చూడాల్సిందే.
Must Read ;- ‘చెత్త’ ఐడియా : జగన్ జమానాలో బ్యాంకులకూ బెదిరింపులు
https://www.idbibank.in/pdf/careers/DetailedAdvertisementSpecialists2020-21New1.pdf











