స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. దీనికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ కథ ఉంటుంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నారు. క్రేజీ హీరోయిన్ రష్మిక ఇందులో బన్నీ సరసన నటిస్తోంది. ఇప్పటి వరకు చూడని విభిన్న పాత్రలో బన్నీ ఈ సినిమాలో కనిపించనున్నారు. డిఫరెంట్ గా ఉన్న ఈ సినిమాలో బన్నీ లుక్ సినిమా పై ఉన్న అంచనాలను పెంచేస్తుంది. ఈ మూవీ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు కానీ.. విలన్ ఎవరు అనేది ఎనౌన్స్ చేయలేదు.
ఇది బన్నీ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అందుకే ఇందులో విలన్ పాత్రకు బాలీవుడ్ విలన్ ని తీసుకోవాలి అనుకున్నారు కానీ.. సెట్ కాలేదని తెలిసింది. ఇప్పుడు తమిళ హీరో ఆర్యను తీసుకున్నారట. విషయం ఏంటంటే.. ఆర్య.. బన్నీ ‘వరుడు’ సినిమాలో విలన్ గా నటించాడు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘వరుడు’ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. అటు బన్నీ, ఇటు గుణశేఖర్ కెరీర్లో డిజాస్టర్ మూవీగా నిలిచింది. అప్పటి నుంచి బన్నీ, ఆర్య కలిసి మరో సినిమా చేయలేదు. మళ్లీ ఇప్పుడు పుష్ప సినిమా కోసం వర్క్ చేయనున్నారు.
ఇండస్ట్రీ లో అసలే సెంటిమెంట్లు ఎక్కువ. ఒకసారి సక్సస్ కాకపోతే మరోసారి కలిసి వర్క్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించరు. అయితే.. బన్నీ మాత్రం సెంటిమెంట్ ను పక్కన పెట్టేశారట. పుష్ప సినిమాలో విలన్ గా ఆర్యను ఫైనల్ చేసే టైమ్ లో సెంటిమెంట్ గురించి ఆలోచించకుండా ఆర్యను ఫైనల్ చేశారట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నారు. మరి.. బన్నీ, ఆర్య కాంబినేషన్ ఈసారైనా వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.
Must Read ;- బన్నీ గురించి వనితా విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!