సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు ప్రజలకు అవి చేస్తాం.. ఇవి చేస్తాం అంటూ హామిలు గుప్పించడం మామూలే. కానీ, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న అభ్యర్థికి కాస్త ఇబ్బందులెక్కువనే చెప్పాలి. అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షలాను ఎదిరించి బరిలో నిలిచి గెలుపు గుర్రాన్ని అందుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. కాస్త ఎక్కువగా కష్టపడాల్సిందే. స్థానిక ఓటర్ల మెప్పుపొందేందుకు ఏదైనా వినూత్నంగా చేయందే పని జరగదు. అదే ఆలోచించినట్లున్నారు ఈ ఇండిపెండెంట్ అభ్యర్ధి కూడా. తన హామీలతో.. సరికొత్త ప్రచారం శైలితో.. ఊరిలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారాడు. ఇంతకీ అతనెవరు? ఏం చేసాడు?
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక ఊరిలో జనాభా దాదాపు 7,840. ఈ గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పడాల రంగారెడ్డి బరిలో నిలిచాడు. ప్రజలను ఆకట్టుకుని.. తన ప్రత్యేకతను చాటుకోవడానికి సరికొత్త స్టైల్‌ని ఎంచుకున్నాడు. ఊరిలో మొత్తం 2,600 కుటుంబాలు ఉంటున్నాయి. వారందరికీ ఏడాదిపాటు ఉచితంగా మినరల్ నీళ్లు. ప్రతి ఇంటికీ ఉచితంగా ఏడాదిపాటు కేబుల్ ప్రసారాలు, విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయమూ, బీపీ, షుగర్‌లకు ఉచిత పరీక్షలు చేస్తామని చెబుతున్నారు. కేవలం నోటి మాట కాదండోయ్.. ప్రజల నమ్మకాన్ని చూరగొనడానికి నోటరీ బాండును చూపిస్తూ.. ఓట్లు అడుగుతున్నారు. ఇవి విన్న, కన్న అందరూ ఇదేం స్టైల్ ప్రచామంటున్నారు.