అటు తారక్ ను .. ఇటు ఎన్టీఆర్ ను తన సెట్లో పెట్టేసుకుని రాజమౌళి చాలాకాలం నుంచి ఊరిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఆయన ‘ఆర్ ఆర్ ఆర్‘ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు .. చరణ్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇద్దరు హీరోలు ఒక సినిమాలో చేస్తున్నారంటే ఆసక్తి పెరగడం సహజం. అలాంటిది ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రల్లో కనిపించడనుండటం అందరిలో మరింత ఆత్రుత పెంచుతోంది.
ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన పతాక సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారు. హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్లైమాక్స్ సీన్ కోసం ఎన్టీఆర్ – చరణ్ రిహార్సల్స్ చేసుకుని మరీ రంగంలోకి దిగుతున్నారు. క్లైమాక్స్ కోసం సాగుతున్న కఠినమైన ప్రాక్టీస్ సెషన్ మధ్యలో .. అంటూ ఈ సినిమా టీమ్, ఇద్దరు హీరోలు సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ఫొటోలను వదిలారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కథానేపథ్యం .. ఎన్టీఆర్ – చరణ్ పాత్రలను మలిచిన విధానం .. వాళ్ల వేషధారణ .. భారీ సెట్లు .. వీఎఫెక్స్ ఇవన్నీ కూడా ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలను పెంచేస్తున్నాయి. ముందుగా ఈ సినిమాను ఈ సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైపోయింది. దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమాను, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ కి .. చరణ్ కి వేరు వేరుగా హిట్లు ఇచ్చిన రాజమౌళి, ఈ ఇద్దరితో కలిసి కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనే టాక్ మాత్రం బలంగానే ఉంది.
Must Read ;- ఎన్టీఆర్, బాలయ్య.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడయ్యా?
Unwinding in the midst of vigorous practice sessions for THE CLIMAX!! 🤩 #RRRMovie #RRR #RRRDiaries pic.twitter.com/OXqHkh4sUc
— RRR Movie (@RRRMovie) February 5, 2021