పంచాయతీ చివరి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి లోపాలు తలెత్తకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని ప్రాంతాల్లో లోపాలు బయటపడుతున్నాయి. కర్నూలు, అదోని మండలం, బైచిగేరిలో కొన్ని అవాంతరాల కారణంగా పోలింగ్ నిలిచిపోయింది. వార్డు మెంబర్ గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచిపోయినట్లుగా సమాచారం. జిల్లా ఎన్నికల అధికారులు వచ్చేంత వరకు పోలింగ్ నిలిపివేశారు. వారు వచ్చి పరిశీలించి నిర్ణయం తీసుకున్నాక తిరిగి ప్రారంభించాలని అక్కడి అధికారులు నిర్ణయించారు.
మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లకు నో ఎంట్రీ: నిమ్మగడ్డ
మున్నిపల్ ఎన్నికల్లో జరగనున్న నేపథ్యంలో పటిష్ట సన్నాహాలు చేస్తుంది ఏపీ ఈసీ. పంచాయతీ...