September 7, 2026 11:05 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

మోదీ భారత్.. The Failed State

కొవిడ్  నియంత్రణ విషయంలో మోదీ ప్రభుత్వాన్ని డైరెక్ట్‌గా బోనులో నిలబెట్టేలా ఇండియా టుడేలో కథనం రావడం చర్చనీయాంశంగా మారింది.

May 8, 2021 at 6:21 PM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ అతలాకుతలం అవుతోంది.నిత్యం వేలాదిమంది చనిపోతున్నారు.లక్షలాది కేసులు నమోదు అవుతున్నాయి.లక్షల కోట్ల సంపద హరించుకుపోతోంది.కరోనా సెకండ్ వేవ్‌ను నియంత్రించడంలో కేంద్ర వైఫల్యాలు, లోపభూయిష్ట విధానాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.భారత్‌లోని పరిస్థితి దయనీయంగా ఉందని, మోదీ ప్రభుత్వం చెప్పేది ఎక్కువ..చేసేది తక్కువ అని అంతర్జాతీయ మీడియా ఇప్పటికే కథనాలు, సంపాదకీయాలు రాసింది. న్యూయార్క్ టైమ్స్, ఆస్ట్రేలియన్ టైమ్స్, స్కైన్యూస్ లాంటి దిగ్గజ మీడియాల్లోనూ ఇలాంటి సంపాదకీయాలే వచ్చాయి.అయితే భారత్‌లో మాత్రం కేంద్ర వైఫల్యాలపై పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు.ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి.మీడియా ఎవరి నియంత్రణలో ఉందనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశంగా మారింది.తాజాగా ఇండియా టుడే సంచలన కథనాన్ని,సంపాదకీయాన్ని రాసింది.THE FAILED STATE శీర్షికతో ఇండియా టుడే ఎడిటర్ ఇన్ చీఫ్ అరుణ్ పూరి ఈకవర్ స్టోరీ రాశారు.ఈ సంపాదకీయంలో మోదీని పరోక్షంలో విఫల ప్రధానిగా అభివర్ణించారని చెప్పవచ్చు.ఇక ప్రముఖ మెడికల్ జర్నల్ THE LANCET కూడా మోదీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యమే కారణమని చెబుతూ..రానున్న కాలంలో తలెత్తే ప్రమాదకర పరిస్థితులపైనా హెచ్చరించింది.అంతర్జాతీయ మీడియా విషయం అటుంచితే.. జాతీయ మీడియాలో కొవిడ్ విషయంలో మోదీ ప్రభుత్వాన్ని డైరెక్ట్‌గా బోనులో నిలబెట్టేలా ఈ స్థాయిలో  కథనం రావడం చర్చనీయాంశంగా మారింది.గతంలో BREATHLESS శీర్షికతో ఇండియా టుడే సంపాదకీయం వచ్చినా.. ఇప్పుడు వచ్చిన స్థాయిలో ఆ విమర్శలు లేవని చెప్పవచ్చు.

ఏకేసిన ఇండియా టుడే..

ఈ సంపాదకీయంలో ముందుగా అరుణ్ పూరి వివరణ కూడా ఇచ్చారు.తాము గతంలో మే 13, 2013 న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ‘‘Dr Dolittle’ శీర్షికతో కథనం రాశామని, నవంబర్ 23, 1998 ఎడిషన్‌లో ‘Unfit to Govern’ శీర్షికతో అటల్ బిహారీ వాజ్‌పేయి ఏడు నెలలు పాలనలో రాజకీయ ప్రవాహం, ఆర్థిక స్తబ్దత మరియు పరిపాలనా విషయాలపై కథనం ఇచ్చామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఆక్సిజన్ అందక పౌరులు చనిపోతుంటే క్రూరమైన వైఫల్యంగా చెప్పదలుచుకున్నామని, ప్రజలు ఎంతో నమ్మకంతో మోదీకి ఓట్లు వేశారని,అయితే ఆ నమ్మకం వమ్ము అవుతోందని వివరించారు.చివరికి ఆసుపత్రి పడకలు,మందులు,ఆక్సిజన్ సిలిండర్లు, అంబులెన్సుల సమస్యలతో పాటు చనిపోయినవారిని దహనం చేసే స్థలం కూడా దొరకని పరిస్థితి దాపురించిందని పౌరుల ప్రాథమిక హక్కైన జీవించే హక్కును నిరాకరించిందని వ్యాఖ్యానించారు.కవర్ పేజీలో ఢిల్లీలో శ్మశాన వాటికలో అంత్యక్రియల కోసం మృత దేహాలు లైన్లో పెట్టిన ఫొటోను ప్రచురించింది.ఘాటైన పదజాలంతోపాటు పౌరుల హక్కులకు భంగం కలగడం, ప్రభుత్వ వైఫల్యాలు,రాజకీయ వ్యవస్థలోని లోటుపాట్లను ఎత్తి చూపింది.గత రెండు వారాలుగా సగటున రోజూ 3 లక్షల కేసులు నమోదు కావడం,సగటున 3,200 మంది మరణించడం, ప్రపంచంలోని కేసుల్లో భారత్ వాటా 46శాతం కాగా మరణాల విషయంలో 25శాతం భారత్‌లో చోటుచేసుకున్నవేనని  ప్రస్తావించింది. గతంలో తాము కొవిడ్‌ను కట్టడి చేస్తామని ప్రకటించిన మోదీ..తరువాత ఎలా విఫలమయ్యారో వివరించింది.జనవరి 28, 2021 న ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌లో ప్రధాని మోడీ గర్వంగా  చెప్పిన మాటలను ప్రస్తావించింది.కోవిడ్ ప్రోటోకాల్‌ను పట్టించుకోకుండా భారీ ఎన్నికల ర్యాలీలు,ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నిబంధనల ఎత్తివేసిన నేపథ్యంలో జాగ్రత్తలపై అవగాహన కల్పించకపోవడం,కనీస నియంత్రణ చర్యలు లేకపోవడాన్ని ప్రస్తావించింది.2021 మార్చి 1 నాటి మా కవర్ స్టోరీలోనూ తాము హెచ్చరికలు ప్రస్తావించామని వ్యాఖ్యానించింది. మొదటి వేవ్‌ను తట్టుకుని నిలబడిన భారత్ ఆ తరువాత నిర్లక్ష్యం కారణంగా రెండో వేవ్ ధాటికి విలవిలలాడుతోందని వ్యాఖ్యానించింది.ఈ విషయంలో ఎక్కువగా పాలకుల విధానాలే కారణమని తేల్చింది.కాగా తాము THE FAILED STATE కవర్ స్టోరీని అన్ని విధానాలను,అంశాలను పరిశీలించాకే రాశామని, ముందస్తు హెచ్చరికలను పట్టించుకోకపోవడం, వైద్య సిబ్బంది కొరత, వైద్య మౌలిక సదుపాయాల కొరత,‌కొవిడ్ టెస్టుల నిర్వహణ, రిపోర్ట్‌లో జాప్యం,ట్రేసింగ్ మరియు ట్రాకింగ్,మందుల కొరత,ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ పతనం,వ్యాక్సిన్ల కొరత, సూపర్-స్ప్రెడర్ సంఘటనలను అరికట్టడంలో నిర్లక్ష్యం ఈ కథనానికి మూలాలుగా మారాయని తేల్చింది. గతేడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు RT-PCR ల్యాబ్‌లను 14 నుంచి 1,600‌కు పెంచగా,డిసెంబర్ 2020 మరియు మే 2021 మధ్య ఆ సంఖ్య 241మాత్రమేనని, నిర్లక్ష్యంతో పాటు కొవిడ్ సెకండ్ వేవ్‌ను లైట్‌గా తీసుకోవడం కూడా కారణమని వ్యాఖ్యానించింది.రిపోర్టుల కోసం నాలుగైదు రోజుల సమయం పట్టడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టడం కష్టం అవుతోందని,కొవిడ్ బాధితులకు అత్యవసర పరిస్థితి తలెత్తుతోందని వ్యాఖ్యానించింది.

టెండర్ల రద్దు..

ఈ కథనంలో ఆక్సిజన్ టెండర్లను రద్దు చేసిన విషయాన్ని కూడా ఇండియా టుడే ప్రస్తావించింది.అక్టోబరులో లక్ష టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను నిల్వకు గ్లోబల్ టెండర్లను పిలిచి మళ్లీ రద్దుచేశారని, పరిస్థితి చేయి దాటాక ఏప్రిల్‌లో 50 వేల టన్నుల మెడికల్ ఆక్సిజన్ నిల్వకు టెండర్లు పిలిచారని పేర్కొంది.అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని చెప్పింది.ఇక కొందరు అధికారుల వైఖరి కారణంగా వినాశ్రాయాల్లోనూ ఆక్సిజన్ దిగుమతులు ఆలస్యం అవుతున్నాయని,చెత్త విధానాలని ఏకరవు పెట్టింది.కనీస ఆర్డర్లు లేకుండానే ప్రపంచంలో అతిపెద్ద టీకా డ్రైవ్ ప్రచారం మొదలు పెట్టడం హేయకరమని అభివర్ణించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 330 మిలియన్ల జనాభాకు 650 మిలియన్ వ్యాక్సిన్ల కోసం ఆర్డర్ ఇస్తే, భారత్ మాత్రం1.3బిలియన్ల జనాభాకు 370 మిలియన్ల వాక్సిన్ ఆర్డర్ ఇచ్చిందని,రెండు కంపెనీలు ఎంత ఉత్పత్తి చేస్తాయో తెలిసినా ప్రభుత్వం చొరవ చూపలేదని వ్యాఖ్యానించింది.పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాక్సినేషన్ పూర్తయ్యేందుకు రెండేళ్లు పడుతుందని తేల్చింది.మొదటి వేవ్ కొంచెం తగ్గగానే మందుల నిల్వను పట్టించుకోలేదని,ఔషధాల తయారీకి ముడిపదార్ధాల ఆర్డర్లనూ ఇవ్వలేదని, వెరసి బ్లాక్ మార్కెట్ పెరిగిందని విమర్శించింది.ధిల్లీతో సహా పలు రాష్ట్రాలు కొవిడ్ మొదటివేవ్ తగ్గగానే ఎమర్జెన్సీ విభాగాల విస్తరణను మర్చిపోయాయని తేల్చింది.

కనీస నైతికత పట్టించుకోరా..

కాగా ఈ కథనంలో మరో సంచలన వ్యాఖ్య కూడా చేసింది.కొన్ని ప్రమాదాలు, వైఫల్యాలు ఎదురైనప్పుడు నైతిక బాధ్యత ఉంటుందని, ప్రస్తుత మోదీ పాలనలో అదికూడా కనిపించలేదని పరోక్షంగా వ్యాఖ్యానించింది.గతంలో రైల్వే ప్రమాదం జరిగిన సమయంలో 1956లో రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి,1962 చైనా యుద్ధంలో ఓడినందున వీకే మీనన్,ఓ కుంభకోణం బయటకు రావడంతో 1992 అప్పటి వాణిజ్య మంత్రి చిందంబరం,1987లో రక్షణ ఒప్పందాల విషయంలో ఆరోపణలు రావడంతో వీపీ సింగ్,1993లో విమాన ప్రమాదం విషయంలో మాధవరావు సింధియా..ఇలా చాలామంది నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేశారని వ్యాఖ్యానించింది ఇండియా టుడే. ఈ ప్రభుత్వం ఆ విషయాలను మర్చిపోయినట్టుందని ఎద్దేవా చేసింది.ఇంతటి జాతీయ విషాదాన్ని బాధ్యతగా తీసుకునేందుకు ఒక్క తలకాయ కూడా ముందుకు రాలేదని వ్యాఖ్యానించింది.అంతా బాగానే ఉందని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని తేల్చింది.పరిస్థితిని ఎలా అదుపులోకి తెస్తారనే విషయంపై ప్రధాని ఇంకా దేశానికి హామీ ఇవ్వలేదని కూడా గుర్తు చేసింది.ఇందుకు మంత్రి వర్గంలో అస్పష్టతే కారణమని అభిప్రాయ పడింది.  ఇప్పటికైనా మోదీ సర్కారు తక్షణ చర్యలకు పూనుకోకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందని వ్యాఖ్యానించింది.

ది లాన్సెట్ ఎద్దేవా..

కరోనా నియంత్రణలో మోదీ సర్కారును తూర్పారాపట్టింది మెడికల్‌ జర్నల్‌ ది లాన్సెట్‌.ఆ మ్యాగజైన్ రాసిన సంపాదకీయంలో కరోనాపై గొప్ప విజయం సాధించే అవకాశాన్ని మోదీ ప్రధానిగా ఉన్న భారత్ చేజేతులా నాశనం చేసుకుందని వ్యాఖ్యానించింది.ఏప్రిల్‌ వరకు కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడాన్ని ప్రస్తావించింది.ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ ఆగస్టు 1 కల్లా భారత్‌లో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా వేసిన నేపథ్యంలో అదే జరిగితే మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.ఇందుకు సంబంధించి కొన్ని సూచనలూ చేసింది. మొత్తం మీద అప్రకటిత జాతీయ అత్యవససర పరిస్థితులను డీల్ చేయడంలో మోదీ సర్కారు గతంలో ఎన్నడూ లేని రీతిలో విఫలమైందని ఆ కథనాలు చెబుతున్నాయి.

Tags: Editorspickindia today story on modi govt faillure on covid became sensationaltelugu news
Previous Post

‘అఖండ’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనట !

Next Post

మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. సోనూ చేతలే!

Related Posts

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

Naina Ganguly Latest Bold Pics

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Sonal Chauhan hottest bikini photos

Lavanya Tripathi

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Ritu Varma Latest Pics

Ghani Movie Actress Saiee Manjrekar Latest Photos

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist