మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇటీవల గ్రాండ్ గా లాంచ్ చేశారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది రామ్ చరణ్ కు 15వ చిత్రం కాగా దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం.
ఈ చిత్రంలో చరణ్ ఓ ప్రభుత్వోద్యోగిగా కనిపించనున్నారని అనౌన్స్మెంట్ పోస్టర్ ని బట్టి తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు దాదాపు 200 కోట్ల బడ్జెట్ కేటాయించారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని శంకర్ ప్లాన్ చేస్తున్నారని.. ట్రైన్ లో జరిగే ఈ ఫైట్ సీన్స్ ఆడియన్స్ కు థ్రిల్ కలిగించేలా ఉంటాయని సమాచారం. ప్రముఖ స్టంట్ మాస్టర్ నేతృత్వంలో ఈ ఫైట్ షూట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కి సుమారు పది కోట్లు ఖర్చు చేయబోతున్నారట. సినిమాలో ఈ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. అంజలి, సునీల్, శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.











