ప్రభాస్ ‘ఆదిపురుష్ ’లో రావణాసురుడుగా ఎవరు నటిస్తారు ? అని దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. సందట్లో సడేమియాలాగా ప్రముఖ హీరో మోహన్ లాల్ రావణుడి గెట్ అప్ లో ప్రత్యక్షమయ్యారు. మోహన్ లాల్ కి రావణాసురుడిగా నటించాలనేది చిరకాల కోరిక. గత ఏడాది వినయన్ డైరెక్షన్ లో రావణ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు కూడా. మోహన్ లాల్ రావణుడి గెట్ అప్ లో స్కెచెస్ కూడా రెడీ చేశారు. అయితే కొన్ని అనూహ్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు .
అయినా రావణాసురుడు పాత్ర మీద మోహన్ లాల్ మోజు తీరలేదు. మొన్న ఓనమ్ పండుగకు ఆసియానెట్ ఛానల్ కోసం మోహన్ లాల్ మిగిలిన స్టార్స్ తో కలిసి ఒక స్పెషల్ షో ” లాల్ ఓనం – నాల్ ఓనమ్ ” చేశారు. ఈ షోలో మోహన్ లాల్ రావణుడి పాత్ర చేసి తన ముచ్చట తీర్చుకున్నారు. అంతేకాదు కుంభకర్ణుడు, విభీషణుడు గెట్ అప్స్ కూడా వేశారు మోహన్ లాల్. ఇది సరదాగా చేశారా ? లేక ‘ఆదిపురుష్’ మేకర్స్ కి తాను ఈ మూడు పాత్రల్లో దేనికైనా రెడీ అని సిగ్నల్స్ పంపుతున్నారా ? అని దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.