గమ్యం, వేదం, కృష్ణం వందేజగద్గురుమ్, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి.. ఇలా విభిన్న కథా చిత్రాలను తెరకెక్కిస్తూ… అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న డైరెక్టర్ క్రిష్. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా.. మానవ సంబంధాల్ని ఎమోషనల్ గా తనదైన శైలిలో హృదయానికి హత్తుకునేలా తీయడం క్రిష్ స్టైల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భారీ పిరియాడిక్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా కేటగిరిలో బహుభాషల్లో విడుదల కానుంది. పవర్ స్టార్ కిది మొదటి పాన్ ఇండియా మూవీ.
కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడడం.. పవన్ ఈ సినిమా కంటే ముందుగా వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ చేయాల్సివుండడంతో.. ఈ గ్యాప్ లో ఓ చిన్న సినిమా ప్లాన్ చేసాడు క్రిష్. ఇందులో మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై క్రిష్, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వికారాబాద్ ఫారెస్ట్ నేపధ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ చిత్రం ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా రూపొందింది. ఎస్.వెంకటరామిరెడ్డి రచించిన ఈ నవలను కొన్ని మార్పులు చేర్పులుతో సినిమాగా తీశారు. అయితే.. ఇప్పటి వరకు టైటిల్ ఏంటి అనేది ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం.. నవలకు ఏ టైటిల్ అయితే.. పెట్టారో.. అదే టైటిల్ అంటే.. కొండపొలం అనే టైటిల్ నే ఫిక్స్ చేసినట్టు తెలిసింది. కొండపొలం టైటిల్ ను క్రిష్ రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. అయితే.. ఈ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేస్తారా..? లేక ఓటీటీలో రిలీజ్ చేస్తారా..? అనేది తెలియాల్సివుంది.











