Is Pooja Hegde Finalized For Pawan Kalyan And Harish Shankar Movie :
పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడంతో మళ్లీ పవన్ – హరీష్ శంకర్ కలిసి సినిమా చేస్తే..చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అది ఇప్పటికి సెట్ అయ్యింది. ఇటీవల ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దీంతో ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే… ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజాహెగ్డేను తీసుకోబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా పూజా హెగ్డే ఈ సినిమా అగ్రిమెంట్ పై సైన్ చేసినట్లు తెలిసింది. కాబట్టి హీరోయిన్ గా ఆమె ఫైనల్ అయినట్లే. పూజాహెగ్డే తొలిసారి పవన్ కళ్యాణ్ తో కలిసి నటించబోతుంది.
హరీష్ శంకర్ తో మాత్రం ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. డీజే దువ్వాడ జగన్నాథమ్, గద్దలకొండ గణేష్. ఈ రెండు సినిమాలు సక్సస్ అయ్యాయి. ఇప్పుడు ఇది మూడో సినిమా కావడం విశేషం. అయితే.. సెంటిమెంట్ కలిసొస్తుందనే పూజాను ఫైనల్ చేశారట హరీష్ శంకర్. మరి.. ఈసారి కూడా హరీష్ శంకర్ కు సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..? భవదీయుడు భగత్ సింగ్ సక్సస్ అందిస్తుందా..? లేదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- పవన్ వెర్సెస్ ఎన్టీఆర్.. బాక్సాఫీస్ వార్ లో విన్నర్ ఎవరు?











